Begin typing your search above and press return to search.
అలా చేసినందుకే బాబు కిక్కురుమనట్లే
By: Tupaki Desk | 12 April 2017 10:39 AM GMTపోలవరం ప్రాజెక్టు విషయంలో పెరిగిన అంచనాలను తాము భరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమే అన్ని అనుమతులు ఇచ్చి, పోలవరాన్ని పూర్తి చేసి బంగారుపల్లెంలో పెట్టి ఏపీకి ఇవ్వాల్సింది పోయి, కమీషన్ల కోసం కేంద్రం నుంచి పోలవరాన్ని చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేయించుకుందని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 7వేల కోట్ల ఎస్టిమేట్స్ తో ట్రాన్స్ ట్రాయ్ కు అప్పగించి కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసం పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు పెంచుకుంటూ పోతున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పోలవరంపై కేంద్రమే అన్నీ భరిస్తుందన్న దానిపై క్లారిటీ లేదన్న శ్రీకాంత రెడ్డి. రీహాబిటేషన్, పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించ లేదని ప్రశ్నిస్తే.. నాబార్డు ద్వారా డబ్బులు వస్తున్నాయి. మీకు ఎందుకు డబ్బులు వస్తున్నాయని చంద్రబాబు ప్రభుత్వం మోసపుచ్చుతూ వస్తోందన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో పోలవరంపై స్పష్టంగా వివరించారని గడికోట శ్రీకాంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 90లో 4వ పాయింట్ ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టుపై అన్ని బాధ్యతలు తీసుకుంటుందని పొందుపరిచారన్నారు. కేంద్రమే పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తుందనుకున్నాం. అయితే, ఇప్పుడు కేంద్రం చెబుతున్న దానికి, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన కుదరటం లేదని మండిపపడ్డ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పోలవరంపై వైయస్ఆర్ సీపీ పలు సందర్భాల్లే లేవనెత్తిన ప్రశ్నలను కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో ప్రశ్నిస్తే.. ఉమాభారతి సమాధానం ఇచ్చారన్నారు. ఇంత ముఖ్యమైన అంశంలోనూ టీడీపీ ఎంపీలు చర్చలో పాల్గొనకుండా నక్కినక్కి ఎందుకు దాక్కొన్నారని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీడీపీ ఎందుకు నిలదీయలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
పలు సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. సోమవారాన్ని పోలవారంగా మారుస్తామన్న బాబు.. కమీషన్ల వారంగా మార్చారని ఎద్దేవా చేసిన శ్రీకాంత రెడ్డి కేంద్రం చెప్పిన దానిపై చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ ఎంపీలు స్పందించకపోవటం దారుణమన్నారు. మిమ్మల్ని తెలుగుద్రోహుల పార్టీగా ఎందుకు అనకూడదని గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలవరంపై కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా అని మేము మొదటి నుంచి ప్రశ్నిస్తూ వచ్చామన్నారు. మీకు ఎందుకు కేంద్రం నుంచి వసూలు చేసుకుంటామన్నారని కానీ ఇప్పుడు కామ్ గా ఉంటున్నారని శ్రీకాంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చే పన్నులను జల్సాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమే పోలవరం కడతామంటే.. కాదు మేం కడతామని కమీషన్ల కోసం తీసుకొని ఏపీ రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెడతారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత ద్రోహం చేసిన టీడీపీ నేతలను క్రిమినల్స్ అని ఎందుకు అనకూడదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. పోలవరం పూర్తయ్యే వరకు వైయస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. దివంగత మహానేత వైయస్ ఆర్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చేశాయన్నారు. పట్టిసీమకు టీడీపీ కేవలం మోటార్లు బిగించి కోట్ల రూపాయలు కమీషన్లు కొట్టేశారన్నారు. వైయస్ఆర్ హయాంలో కన్నా పదిరెట్లు ధరలు పెంచేసి కమీషన్లు కొట్టేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని ఆయన హితవు పలికారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/