Begin typing your search above and press return to search.
నారా చంద్రబాబుకు వైకాపా కొత్త పేరు
By: Tupaki Desk | 28 Sep 2016 10:15 AM GMTఅవును! వైకాపా నేతలు సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసే కామెంట్లు - పెట్టే పేర్లు విచిత్రంగా ఉంటాయి. గతంలో అసెంబ్లీ సాక్షిగా కాల్ మనీ(కామ) చంద్రబాబు అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించిన రోజా.. ఆ తర్వాత ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. ఇక, ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా ఇలాంటి వివాదాస్పద కామెంట్లే చేసి మీడియాలో హాట్ టాపిక్ క్రియేట్ చేశారు. ఏపీ సీఎంను ఆయన ఏకంగా గ్యాంగ్ స్టర్ నయీంతో పోల్చారు. చంద్రబాబు.. నారా చంద్రబాబు కాదని, నయీం చంద్రబాబని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు దొంగలుగా మారారని విమర్శించారు.
బుధవారం హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ లంచం కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడమే అందుకు ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదుల అనుసంధానం కాదు.. అవినీతి అనుసంధానం జరుగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత ఎత్తున అవినీతి ఆరోపణుల వస్తున్నా సీఎం మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని స్టేట్‌లో ప్రతి గ్రామానికి ఒక నయీం తయారయ్యాడని ఫైరయ్యారు.
రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వైకాపాకి చెందిన మరో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి కూడా సీఎంపై ఫైరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టరును బెదిరించిన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా.. కూడా.. టీడీపీ తమ్ముళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబే కావాలని తన ముడుపుల కోసం అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఏదేమైనా.. చంద్రబాబును విమర్శించడమే కాకుండా ఆయనను నయీంతో పోల్చడం ఆసక్తిగామారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/