Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాలపై ఎమ్మెల్యే ధ్వజం
By: Tupaki Desk | 31 March 2016 7:46 AM GMTరాయలసీమ వాళ్లను సినిమాల్లో చెడుగా చూపించడం మానుకోవాలని హితవు పలుకుతున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. తెలుగు సినిమాల్లో సీమ వాళ్లను గూండాలుగా చిత్రీకరించడం దారుణమంటూ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి పడ్డాడు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఏమైనా అంటే రాయలసీమ గూండాలు అని వాడటం అందరికీ అలవాటైపోయింది. మా సంస్కృతిని అదేపనిగా కించపరుస్తున్నారు. రాయలసీమ వాళ్లంటే ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టే సంప్రదాయం ఉన్నవాళ్లు. మేం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కష్టం అని వచ్చిన వాళ్లను ఆదుకుంటాం. ఆతిథ్యంలో ముందుంటాం. కానీ దురదృష్టవశాత్తూ మా ప్రాంత జనాల్ని రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఈ దుష్ట సంప్రదాయం ఎక్కువైపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీకాంత్ రెడ్డి.
ఇకపై సినిమాల్లో రాయలసీమ వాళ్లను ఇలా గూండాలుగా, రౌడీలుగా చిత్రీకరిస్తే.. శాసన సభ తరఫున నోటీసులు ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. సినిమాలు తీసే దర్శకులు - నిర్మాతలు రాయలసీమ వాళ్ల గురించి వాస్తవాలు తెలుసుకోవాలని.. ఇకనైనా ఈ ప్రాంత ప్రజల్ని గూండాలుగా చూపించడం మానుకోవాలని ఆయన హితవు పలికాడు.