Begin typing your search above and press return to search.

శ్రీలక్ష్మి సడెన్ సర్ ప్రైజ్...జగన్ ఆదేశాలతోనే

By:  Tupaki Desk   |   17 Dec 2022 2:30 AM GMT
శ్రీలక్ష్మి సడెన్ సర్ ప్రైజ్...జగన్ ఆదేశాలతోనే
X
జగన్ ప్రభుత్వం కొందరు అధికారులకు పెద్ద పీట వేస్తోంది. కీలకమైన స్థానలలో వారిని నియమించి మరీ పాలనా రధాన్ని పరుగులు తీయిస్తోంది. వైఎస్సార్ హయాంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జగన్ సీఎం అయ్యాక తెలంగాణా క్యాడర్ నుంచి ఏపీకి బదిలీ మీద వచ్చారు. ఆమెకు వైసీపీ ప్రభుత్వం కీలకమైన బాధ్యతలను అప్పగించింది.

ఇపుడు శ్రీలక్ష్మి తనదైన ముద్రను పాలన మీద వేస్తున్నారు. మునిసిపల్ శాఖను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అలా జగన్ తన మీద నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను ఆమె పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారు. శ్రీలక్ష్మి ఈ రోజు సడెన్ గా తాడేపల్లి మునిసిపల్ ఆఫీస్ లో తనిఖీ చేశారు. ఈ సర్ ప్రైజ్ కి అక్కడ ఉద్యోగులు సిబ్బంది షాక్ తిన్నారు.

శ్రీలక్ష్మి రాక సీక్రెట్ గా ఉంచడంతో ఆమె రాదు అనుకున్న వారు యధా ప్రకారం రిజిష్టర్ లో సంతకాలు చేసి బయటకు వెళ్ళిపోయారుట. మరికొందరు సైతం నిర్లక్ష్యంగా ఉంటూ శ్రీలక్ష్మి కంటబడ్డారు. దాంతో సంతకాలు పెట్టి బయటకు వెళ్ళిన ఉద్యోగుల వివరాలను ఆరా తీసి వాటిని తనకు అందచేయాలని ఆమె ఆదేశించారు. ఇక ఆమె అక్కడ ఉద్యోగులను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. నాలుగవ తరగతి ఉద్యోగులతో కూడా మాట్లాడి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలియచేయాలని కోరారు.

రాష్ట్రంలో కీలకమైన శాఖగా ఉన్న మునిసిపల్ శాఖలో పాలనను మరింత పటిష్టం చేయడానికే ఆమె ఈ సడెన్ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు. ప్రజలకు నేరుగా పౌర సేవలు ఎన్నో అందించాల్సిన మునిసిపల్ శాఖలో ఉదాశీనత, నిర్లక్ష్యం ఉండరాదని వైసీపీ సర్కార్ భావిస్తోంది. దాంతోనే జగన్ ఆదేశాల మేరకు శ్రీలక్ష్మి ఇలా తనిఖీలు చేపట్టారు అని చెబుతున్నారు

ఈ ఆకస్మిక తనిఖీ ఏపీలోని మొత్తం మునిసిపల్ వ్యవస్థకు ఒక హెచ్చరికగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె ఈ తరహా తనిఖీలు మరిన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తద్వారా పాలనను గాడిలో పెట్టాలన్నదే ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మరో వైపు చూస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి నియామకం ఈసారి జరగాలి. కానీ జవహర్ రెడ్డికి ఆ చాన్స్ ఇచ్చారు. జగన్ సర్కార్ రెండవసారి అధికారలోకి వస్తే కచ్చితంగా శ్రీలక్ష్మి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతుంది అని అంటున్నారు.

ఇదిలా ఉండగా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కావడంలేదు అంటూ వస్తున్న ఫిర్యాదుల నేపధ్యంలో కొత్త సీఎస్ జవహర్ రెడ్డికి శాఖాపరంగా అంతా సవ్యంగా ఉండేలా చూసుకోవాలని జగన్ ఆదేశించారని అంటున్నారు. దాంతో పాటుగా సీనియర్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఫీల్డ్ లోకి వచ్చారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.