Begin typing your search above and press return to search.
కొబ్బరి చెట్టు ఎక్కిన మంత్రి.. వింత మీడియా సమావేశం
By: Tupaki Desk | 19 Sep 2020 4:30 PM GMTఅందరూ మంత్రి హోదాలో బీరాలకు పోవడమే చూశాం.. కానీ నిజంగా ఆ మంత్రి నటించడం కాదు.. జీవించేశాడు. ఆ మంత్రిగారు వ్యవసాయ మంత్రి. కొబ్బరి చెట్లపై సమీక్షను ఎక్కడ నిర్వహించాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
కొబ్బరి తోటలో మీడియా సమావేశం ఉందని మీడియా వారికి కబురు పంపిన మంత్రి మీడియా జర్నలిస్టులకు నిజంగానే షాక్ ఇచ్చాడు.
శ్రీలంకకు చెందిన కొబ్బరి, ఫిష్ టైల్ ఫామ్, రబ్బరు ఉత్పత్తుల శాఖ మంత్రి ఫెర్నాండో నిజంగా మీడియా జర్నలిస్టులకు షాకిచ్చాడు. కొబ్బరి ఎస్టేట్ లో కొబ్బరికాయల ధరలపై మీడియా సమవేశాన్ని పెట్టి అందరినీ ఆహ్వానించాడు. కానీ మంత్రిగారు కనిపించలేదు.
నిజంగానే కొబ్బరి రైతులా యంత్రం సాయంతో మంత్రి చెట్టు ఎక్కి దానిమీదే దాని నిర్వహణపై మీడియాకు వివరిస్తూ మాట్లాడాడు. కొబ్బరి కాయలు కోసే కూలీల పరిస్థితి. ఎక్కి కోయడంలో ఇబ్బందులు.. కొబ్బరి చెట్టు ఎక్కే యంత్రం ఉపయోగాలు.. ఇలా అన్నింటిని మీడియాకు కళ్లకు కట్టాడు. ఇలా మంత్రి గారు నిజంగానే లైవ్ పర్ ఫామెన్స్ ఇచ్చే సరికి మీడియా జర్నలిస్టులంతా అవాక్కయ్యారు.