Begin typing your search above and press return to search.
అందరినీ లోపలేస్తే..జైల్లు కూడా చాలవు బాబు
By: Tupaki Desk | 7 July 2017 9:42 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును సామాజిక వేత్త శ్రీమన్నారాయణ తప్పుపట్టారు. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అమరావతి ని అడ్డుకునే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయమనడం సరికాదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని అన్నారు. తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల అమాయకత్వాన్ని ఒక అస్త్రం గా వాడుకుంటుందని శ్రీమన్నారాయణ ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 33వేల ఎకరాలు కాదని 50వేల ఎకరాల కంటే ఎక్కువ భూమినే రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నారని దుయ్యబట్టారు. తాము ఏ పార్టీకి చెందిన వారము కాదని శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకీ అలాగే రాజధానికి కూడా వ్యతిరేకం కాదన్నారు. కేవలం మూడు పంటలు పండే సారవంతమైన భూములను నాశనం చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాయలను 70 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సారవంతమైన భూముల ను రక్షించాలనే ఉద్దేశంతో తాము 2 సంవత్సరాల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ఆశ్రయించామని ప్రస్తుతం తీర్పును రిజర్వులో ఉన్నదన్నారు.
ఈ పరిస్థితిలో కేస్ ఉపసంహరించుకోవాలని లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపుతామని కొంతమంది బెదిరిస్తున్నారని శ్రీమన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు భయపడేది లేదని, జైలుకు వెళ్లయినా పోరాడతామని హెచ్చరించారు. తమకేదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.