Begin typing your search above and press return to search.

కార్పొరేటర్‌ కు కరోనా పాజిటివ్ .. చట్టపరంగా చర్యలు తప్పవు !

By:  Tupaki Desk   |   6 May 2020 11:30 PM GMT
కార్పొరేటర్‌ కు కరోనా పాజిటివ్ ..  చట్టపరంగా చర్యలు తప్పవు !
X
కరోనా వైరస్‌ గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఓ ప్రజాప్రతినిధి స్వయంగా అతనే నిబంధనలను తుంగలో తొక్కాడు. లాక్‌ డౌన్ ‌ను ఉల్లంఘించిన సోదరుడి వివరాలు దాచిపెట్టి కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమయ్యాడు. దీనితో అయన పై ప్రస్తుతం పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన కశ్మీర్‌ లో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ మాజిద్‌ షులూకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతడి నివాసానికి చేరుకోగా కార్పొరేటర్‌ సోదరుడు ఇటీవలే ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు వచ్చినట్లు గుర్తించారు. అతడు లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి దొంగతనంగా ఓ ట్రక్కులో ఇంటికి చేరుకున్నట్లు తెలుసుకున్నారు. దీంతో మాజిద్‌ తో పాటు అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు.

ఈ విషయం పై జిల్లా అభివృద్ధి కమిషనర్‌ షాహిద్‌ చౌదురి మాట్లాడుతూ..గత కొన్ని వారాలుగా కరోనా వ్యాప్తిని నియంత్రణ చేయగలిగాం. అయితే ప్రయాణ చరిత్రను దాచి.. కొంతమంది వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. కాగా కార్పొరేటర్‌ కు కరోనా సోకినట్లు తేలడంతో ఎస్‌ ఎంసీ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ మేయర్‌ జునైద్‌ మట్టు విజ్ఞప్తి చేశారు. అలాగే కార్పొరేటర్ ను కలిసిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా నిర్దారణ పరీక్షలు చేపించుకోవాలని అయన కోరారు.