Begin typing your search above and press return to search.

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాథ్ రెడ్డి

By:  Tupaki Desk   |   4 Oct 2019 11:53 AM GMT
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాథ్ రెడ్డి
X
ప్రముఖ పాత్రికేయుడు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియామకం అయ్యారు. గత ఏడాది వరకు వాసుదేవ దీక్షితులు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆయన ఈ ఏప్రిల్ లోనే కన్నుమూశారు. దీంతో ఖాళీగా ఉన్న ఈ పదవిలో శ్రీనాథ్ రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని కోరగుంట పల్లె శ్రీనాథ్ రెడ్డి స్వగ్రామం. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గానికి చెందిన ఈయన 28 ఏళ్లుగా జర్నలిజంలో వివిధ హోదాల్లో పనిచేశారు. చాలా పత్రికలు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి జాతీయ ఆంగ్ల దినపత్రికల్లోనూ పనిచేశారు. ఆంధ్రప్రభలో లోనూ జర్నలిస్టుగా పనిచేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులు అయిన దేవులపల్లి అమర్, కే శ్రీనివాసరెడ్డి సమీకాలికుడు ఈయన.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండేవారు. జగన్ పై పలు పుస్తకాలు రాశారు.

అయితే వాస్తవానికి సాక్షి టీవీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి కోసం జగన్ పరిశీలించినట్టు సమాచారం. అయితే ఆ అవకాశం చివరకు దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డికి దక్కింది.

అయితే కొమ్మినేనికి ప్రభుత్వంలో మరికొన్ని కీలక పదవులను ఇచ్చే ఆస్కారం ఉన్నట్టు తెలిసింది. సాక్షి ఎడిటర్ మురళి కూడా సీఎం కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా నియమించబడే ఆస్కారం కనిపిస్తోంది.