Begin typing your search above and press return to search.
ఏమిటీ శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ల లొల్లి? రెండింటిలో తేడా ఏంది?
By: Tupaki Desk | 4 March 2022 10:30 AM GMTతెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు రూ.15 కోట్ల సుపారీ తీసుకొని అంతమొందించే కుట్రను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు భగ్నం చేయటం.. దానికి ప్లాన్ చేసిన ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేయటం తెలిసిందే. తీవ్ర సంచలనంగానూ.. పలు సందేహాలకు కారణమైన ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరిగినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. హత్యకు కుట్ర కాదు..రాజకీయంగా తమను దెబ్బ తీసేందుకే కుట్ర చేశారంటూ డీకే అరుణ లాంటి నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ హత్య కుట్ర అసలెందుకు? శ్రీనివాస్ గౌడ్ తో ఉన్న విభేదాలేంటి? చంపుకునేంత పగ ఏమిటి? అన్న దానికి 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన రెండు అఫిడవిట్లుగా చెబుతున్నారు.
ఇంతకీ రెండు అఫిడవిట్లు ఏంటి? మొదటి దానిలో.. రెండో దానిలో ఉన్న తేడాలేంటి? అన్న విషయంలోకి వెళితే.. పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన మొదటి అఫిడవిట్ కు.. ఆ తర్వాత స్థానిక ఎన్నికల కమిషన్ సిబ్బంది సాయంతో మరో అఫిడవిట్ ను అక్రమంగా అప్ లోడ్ చేశారన్న ఆరోపణ ఉంది. మరి.. ఈ రెండు అఫిడవిట్లలో ఉన్న తేడాలేంటి? మొదటి దానిలో ఉన్నదేంటి? రెండో దానిలో లేనిదేంటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు అఫిడవిట్లకు సంబంధించిన తేడాలపై ఏమని చెబుతున్నారంటే..
మొదటి.. రెండో అఫిడవిట్ లో ఉన్న తేడాలివేనట
- డిపాజిట్లు, బాండ్లకు సంబంధించి మొదటి అఫిడవిట్‌లో శ్రీనివా్‌సగౌడ్ తన పేరున రూ.29,06,325 ఉన్నాయని పేర్కొన్నారు. రెండో అఫిడవిట్‌లో రూ.28,44,203 ఉన్నాయని పేర్కొన్నారు.
- వ్యవసాయ భూములకు సంబంధించి తన పేర ఉన్న భూముల అభివృద్ధి, ఇతర పెట్టుబడులకు ఖర్చు చేశారా? అనే కాలమ్‌లో మొదటి అఫిడవిట్‌లో నిల్ అని పేర్కొని.. రెండో అఫిడవిట్‌లో మాత్రం తన పేర ఉన్న వ్యవసాయ భూమిలో రూ.15లక్షలు, స్పౌజ్ పేర ఉన్న భూమిలో రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు.
- అప్పులు.. డ్యూస్ టు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ అనే కాలమ్‌లో ఎలాంటి బకాయిలు లేవని రెండు అఫిడవిట్లలో పేర్కొన్నారు.
అయితే, పాలమూరు అభివృద్ధి ఫోరమ్ తరఫున మహబూబ్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి చేసిన ఫిర్యాదు ప్రకారం.. శ్రీనివా్‌సగౌడ్ పేరున ఉన్న టీఎస్ 06 ఈఎల్ 6666 ఫార్చ్యూనర్ వాహనంపై 29 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు గాను రూ.35,515 బకాయిలు ఉన్నాయి.
ఆయన సతీమణి పేరున ఉన్న టీఎస్ 06 ఈఆర్ 6666 వాహనంపై 8 చలాన్లు రూ.10,180 కలిపి మొత్తం రూ.45,695 బకాయి ఉంది.
ఈ వివరాలను కూడా శ్రీనివా్‌సగౌడ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదంటూ అప్పట్లో ఫిర్యాదు చేశారు.
- ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో మొదటి అఫిడవిట్‌ని 14.11.2018న అప్‌లోడ్ చేశారని.. అందులోని తప్పుల్ని గుర్తించి సవరించిన రెండో అఫిడవిట్‌ని 19.11.2018న అప్‌లోడ్ చేసినట్లుగా చెబుతారు.