Begin typing your search above and press return to search.
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు అన్న టీ మంత్రి
By: Tupaki Desk | 30 Sep 2019 5:18 AM GMTపాత గాయాలు మానుకొని.. కొత్త బంధాల దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ఊహించనిరీతిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఆంధ్రా.. తెలంగాణ ప్రాంతాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని.. పాత విషయాల్ని మర్చిపోయి అందరూ కలిసి ఉన్నట్లుగా ఈ మధ్యన కేసీఆర్ వ్యాఖ్యలకు భిన్నంగా.. ఆయన మంత్రివర్గంలోని మంత్రి ఒకరు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.
అవసరానికి మించిన విషాన్ని చిమ్మేలా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు.. విద్యార్థులకు మంచి చదువు అందిస్తామని చెబుతూ మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారు.. వారి ఊబిలో ఎవరూ పడకూడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఒక అభినందన సభలో పాల్గొన్న ఆయన నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలంతా కలిసి ఉన్నారంటూ సీఎం కేసీఆర్ మాటలకు భిన్నంగా మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఆంధ్రోళ్ల మీద ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే.. తాను చేసింది కొందరు ఏపీ వ్యాపారుల మీదనంటూ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు.. ఏపీ ప్రజల్ని తీవ్రంగా హర్ట్ చేయటం ఖామంటున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ స్పీకర్ పోచారం సైతం ఆంధ్రా.. తెలంగాణ అన్న భేద భావం లేకుండా ప్రజలు కలిసి మెలిసి ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన దానికి భిన్నంగా.. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఉన్నాయమంటున్నారు. పాతగాయాల్ని రేపేలా తెలంగాణ మంత్రి మాటలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అనుకోని రీతిలో శ్రీనివాస్ గౌడ్ ఇలా మాట్లాడలేదని.. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఆయన మరిన్ని మాటలు మాట్లాడటం గమనార్హం.
ఇదే సభలో ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వాసం కలిగి ఉంటారని.. ఎవరినీ మోసం చేయరన్నారు. నమ్ముకుంటే ప్రాణం ఇస్తారన్న ఆయన.. ఆంధ్రాకు చెందిన కొందరు విద్యను వ్యాపారం చేస్తూ తల్లిదండ్రుల్ని దోచుకుతింటున్నట్లుగా మండిపడ్డారు. ఏమైనా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఆంధ్రోళ్ల మనసుల్ని గాయపరిచేలా ఉండటమే కాదు.. వారి సెంటిమెంట్లను ఇంతలా దెబ్బ తీయటం సరికాదన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై ఏపీకి చెందిన వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.