Begin typing your search above and press return to search.
ఆంధ్రోళ్లకు హైదరాబాద్ లో ఏం పని?
By: Tupaki Desk | 30 Aug 2015 4:30 AM GMTరాజకీయాలు ఎంత చిత్రంగా ఉంటాయంటే...ఇవాళ్టి ప్రకటనకు... మరుసటి రోజు చేసే హెచ్చరికకు ఏం సంబంధం ఉండదు. పార్టీ అధినేత భరోసా ఇస్తుంటే.... చోటా నాయకుడు బెదిరిస్తుంటాడు. పాలకులు మేమున్నాం అంటుంటే... ప్రజలు భయంలోకి పోయే పరిస్థితులు వస్తుంటాయి. ఇదంతా ఎందుకంటారా? ఇప్పుడు ఇరు రాష్ర్టాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. తాజాగా తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ప్రకటన ఇందుకు చక్కటి ఉదాహరణ.
ఏపీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర అక్కర్లేదని నిర్ణయం తీసుకుంది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణవాదులు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆంధ్రాబాబు, ఏపీ పక్షపాతి, తెలంగాణ వ్యతిరేకి...వగైరా రొటీన్ విమర్శలు చేసేశారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే, ఉద్యోగ సంఘాల మాజీ నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆసక్తికర డిమాండ్ తెరమీదకు తెచ్చారు.
తెలంగాణ చరిత్ర అవసరం లేనప్పుడు... ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు హైదరాబాద్ లో ఉండడం దేనికి? అంటూ నిలదీశారు. దీంతో పాటు ఆయన ఓ హెచ్చరిక కూడా చేశారు. ఏపీ వారు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. అంటే మళ్లీ ఆంధ్రావారిని హైదరాబాద్ ప్రస్తావన తెస్తూ హెచ్చరికలు చేయడం అన్నమాట.
ఉద్యోగ సంఘాల నాయకుడు అయిన శ్రీనివాస్ గౌడ్ కు రాజ్యంగం, చట్టం తదితరాలు తెలియదు అని అనుకోలేం. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఇక్కడ ఉండేందుకు తెలంగాణవారికి ఎంత హక్కు ఉంటుందో..ఆంధ్రావారికి అంతే హక్కు ఉంటుంది. పోనీ ఇపుడే ఏమైనా పదేళ్ల గడువు ముగిసిందా అంటే అదీ లేదు. కానీ సదరు ఎమ్మెల్యే గారు ఇలా స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధి కి అంతా కలిసి కృషి చేద్దాం అంటూ ప్రకటనలు ఇస్తుంటారు. అదే క్రమంలో హైదరాబాద్ లోని ఉన్నవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను....వారి కాలికి ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తాను అంటూ బడా బడా హామీలు ఇస్తుంటారు. ఇంతకీ ఏది నిజం? హైదరాబాద్ లోని ఆంధ్రుల విషయంలో పార్టీ అధినేత, ప్రభుత్వ సారథి చెప్పిన కేసీఆర్ చెప్పిన మాటను నమ్మాలా? లేక ఏపీ ప్రభుత్వం చేసిన దూకుడు పనికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చేసిన హెచ్చరికను నమ్మాలా?