Begin typing your search above and press return to search.
జేసీ వల్లే తెలంగాణ ఒప్పుకోలేదట
By: Tupaki Desk | 23 Dec 2016 4:10 PM GMTఅనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా జేసీకి తెలంగాణపై యావ తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా తమ ప్రాంతంలో బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని విమర్శించారు. ఇలా అక్రమంగా బస్సులు నడిపించడం వల్లే పాలెం ఘటనలో 45 మంది చనిపోయారని గుర్తుచేశారు. బాధితులపైన కఠిన చర్యలు తీసుకొని చనిపోయిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
జేసీ దివాకర్ రెడ్డి - ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు ఉండటం వల్లే అప్పట్లో తెలంగాణ వాళ్లు సీమ ప్రజలపై దురభిప్రాయం ఏర్పరచుకున్నారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. అదే విధంగా జేసీ లాంటి దౌర్జన్యం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి రాయల తెలంగాణ తాము ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్ర దౌర్జన్యలు కొనసాగవని హెచ్చరించారు. తెలంగాణ పరిపాలన విషయంలో ఇంకా సీమ నేతలు ఉన్న అధికార యావను వదులుకోవాలని సూచించారు. ఏపీ బస్సు లు తెలంగాణలో ఎన్ని నడుస్తున్నాయో మన బస్సు లను ఏపీలో కూడా నడవనివ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏపీలో నడుస్తున్న తెలంగాణ బస్సు లపై అక్రమ కేసు లు బనాయిస్తున్నారని..ఇది ఇలానే కొనసాగితే తెలంగాణ లో మేము కూడా కేసు పెడుతామని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/