Begin typing your search above and press return to search.
పదినెలల మానసిక క్షోభను బయటపెట్టారు
By: Tupaki Desk | 12 April 2015 6:10 AM GMTఉద్యమనాయకుడిగా పేరొంది.. నమ్మకస్తుని కోటాలో ఎమ్మెల్యే వరకు ఎదిగి.. మంత్రిగా కావాలనుకున్న వ్యక్తికి కాస్తంతలో ఆ పదవి మిస్ అయితే ఆ బాధ అంతాఇంతా కాదు. ఆ వేదన చెప్పనలవి కాదు. విధేయత హద్దుల గీత దాటితే ఏమవుతుందన్న సందేహం పట్టి పీడిస్తున్నా.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికి అనుకున్నారేమో కానీ.. తన పది నెలల మానసిక క్షోభను బయటపెట్టేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పెద్దగా సంకోచించలేదు.
తనకు జరిగిన అన్యాయంపై ఆయన గళం విప్పారు. టీఆర్‌ఎస్ పార్టీలో సరికొత్త సంస్కృతికి తెర తీశారు. పదవి వచ్చినా రాకున్నా.. అధినేత కరుణ ఉన్నా లేకున్నా.. గుట్టుగా.. గుంభనంగా.. అధినేత మనసును దోచుకునేందుకు గుండెల్లో ఉన్న వేదనను గుట్టుగా దాచుకునే వైఖరికి భిన్నంగా శ్రీనివాస్‌గౌడ్ తన మనసులో రగులుతున్న విషయాన్ని బయటపెట్టేశారు.
తనకు మంత్రిపదవి వచ్చే అవకాశాన్ని కొద్దిలో మిస్ అయిన విషయాన్ని ప్రస్తావించటమేకాదు.. దానికి కులం రంగును పులమటం ఇప్పుడు తెలంగాణ అధికారపక్షంలో కలకలం సృష్టిస్తోంది. బీసీగా పుట్టడమే తాను చేసిన నేరమా? అంటూ శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నిస్తున్నారు. నల్గండ జిల్లాకు చెందిన అగ్రవర్ణ నేతలు ఇద్దరు కలిసి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
జ్యోతిబా ఫూలే 189వ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తన మనసులో సాగుతున్న సంఘర్షణను బయటపెట్టేశారు. గడిచిన పది నెలల కాలంలో తాను తన నియోజకవర్గంలోఎన్నో పనులు చేశానని.. అయినప్పటికీ తనకు మంచిపేరు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న నేతలిద్దరి పేర్లను త్వరలోనే బయటపెడతానని చెప్పిన శ్రీనివాస్‌గౌడ్.. తన తోటి పార్టీ నేతలు చేస్తున్న కుతంత్రాలపై కంటతడి పెట్టారు. భావోద్వేగంగా కదిలిపోయారు. తెలంగాణ ఉద్యమంలో.. సీమాంధ్రులపై పోరాటం చేసిన సమయంలో సైతం కంట కన్నీరు రాకున్నా.. తన సోదర సమానులైన తెలంగాణ నాయకులు.. అందులోనూ స్వయంగా తానున్న పార్టీకి చెందిన నేతల కుతంతాలపై అసాంతం కదిలిపోయారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో స్థానం మిస్ కావటాన్ని ఎవరు మాత్రం తట్టుకోగలరు..?