Begin typing your search above and press return to search.
అక్కడ మీరు.. ఇక్కడ మేము.. బీజేపీని ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్లు!
By: Tupaki Desk | 30 Aug 2021 1:30 AM GMTబీజేపీకి-తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు మధ్య ఏ రకమైన సంబంధాలు ఉన్నాయో.. ఎలాంటి విభేదా లు ఉన్నాయో.. అందరికీ తెలిసిందే. నిత్యం.. నాలుగు వివాదాలు.. పది విభేదాలు.. అన్నట్టుగా..ఇరు పార్టీలూ.. రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత విమర్శల వరకు ఏది దొరికినా వదలకుండా ఒకరిపై ఒకరు రువ్వుకుంటున్న పరిస్థితి తెలిసిందే. అంతేకాదే.. ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు.. పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనేలా కనిపిస్తోంది. అయితే.. ఇలాంటితరుణంలో .. బీజేపీని అధికార టీఆర్ ఎస్ నాయకులు ఎవరైనా పొగుడుతారని ఊహించగలరా?
బీజేపీ కూడా ఊహించి ఉండదు!
బీజేపీని ఆకాశానికి ఎత్తుతారని అనుకోగలరా? .. ఇలాంటివి ఊహలకే అందని పరిణాలు. అయితే.. ఈ అంచనాలను కూడా పటాపంచలు చేస్తూ.. గతంలో ఉద్యోగ సంఘాల నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్లు చేశారు. బీజేపీని ఆకాశానికి ఎత్తేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. అసలు బీజేపీ నేతలు మంత్రి అంచనావేసినట్టుగా కూడా ఆలోచించే సాహసం చేయని మాటలు అనేశారు. దీంతో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిముషాల వ్యవధిలో మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి.
ఏం జరిగిందంటే..
ఖేలో ఇండియా పథకం కింద దీనికి నిధులు కేటాయించిన.. ఉస్మానియా వర్శిటీలో స్పోర్స్ట్ క్లస్టర్స్‌కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు జీ. కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి క్రీడల శాఖ రాష్ట్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో నిర్వహించిన సభలో ముందు కిషన్ రెడ్డి మాట్లాడారు. తర్వాత ... రాష్ట్ర మంత్రి, టీఆర్ ఎస్ నాయకుడు.. శ్రీనివాస్ గౌడ్ మైకు అందుకుని మాట్లాడుతూ.. బీజేపీని ఆకాశానికి ఎత్తేశారు.
అక్కడ మీరు.. ఇక్కడ మేం!
శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే.. ``అక్కడ మీరు.. ఇక్కడ మేము.. 15 ఏళ్లు లేదంటే 20 ఏళ్లు అధికారంలో ఉండటం ఖాయం. మీరు, మేము కలిసి తెలంగాణను మరింత అభివృద్ధి చేద్దాం. ప్రతి ఒక్కరికీ మేలు చేద్దాం`` అన్నారు. దీంతో ఒక్కసారిగా ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్ ఎస్ నేతలు సహా మీడియా వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేశాయి. నిత్యం తిట్టిపోసుకుని, సవాళ్లు రువ్వుకునే రెండు పార్టీల మధ్య ఇంత అవగాహన ఉందా? అని నివ్వెర పోయాయి. రాష్ట్రంలో బీజేపీ సారథి బండి సంజయ్ .. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా.. ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టారు. ఇలాంటి సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరి దీనిపై టీఆర్ ఎస్ పెద్దలు, బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.