Begin typing your search above and press return to search.
ఊసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన మనోడు ఎవరు? ఏం చేస్తుంటాడు?
By: Tupaki Desk | 15 Feb 2020 8:09 AM GMTమీకు క్రికెట్ ఇష్టం ఉండొచ్చు. మరికొందరికి ఫుట్ బాల్.. ఇంకొందరికి టెన్నిస్.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో క్రీడ మీద ఆసక్తి ఉండొచ్చు. కానీ.. క్రీడల్ని అభిమానించే వారు ఎవరైనా సరే.. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ఎవరంటే నూటికి 95 శాతం మంది చెప్పే పేరు ఊసేన్ బోల్ట్. వందమీటర్ల పరుగు పందెంలో మెరుపు వేగంతో పూర్తి చేసిన ఊసేన్ బోల్ట్..ఆ రికార్డును తన పేరిట భద్రంగా నిలుపుకున్నాడు. దాన్ని బ్రేక్ చేసేలా మెరిసాడు మనోడు ఒకడు.
మెరుపు వేగంతో అతగాడు పరిగెత్తిన వైనం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. రాత్రికి రాత్రే అతన్నో ప్రముఖుడిగా మార్చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తానేం సాధించానన్న విషయాన్ని సాధించిన శ్రీనివాస్ కు కూడా అర్థం కాని పరిస్థితి. ఇంతకూ ఈ శ్రీనివాస్ ఎవరు? ఈ పరుగు పందెం ఏమిటి? ఇప్పుడింత హాట్ టాపిక్ ఎందుకైందన్న వివరాల్లోకి వెళితే..
ఈ నెల ఒకటిన కర్ణాటక లోని మంగళూరు ప్రాంతానికి దగ్గర్లో ఐకళ అనే ప్రాంతంలో కంబళ అనే సంప్రదాయ క్రీడను నిర్వహించారు. బురద నేతలో దున్నపోతులతో పాటు వేగంగా పరిగెత్తాలి. దున్న కంటే వేగంగా పరిగెత్తి విజేతగా నిలిచిన వారికి భారీ ఎత్తున బహుమానాలు ఇస్తుంటారు. ఈ క్రమం లో 142.50 మీటర్ల దూరాన్ని తన దున్నలతో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కేవలం 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే.. వంద మీటర్ల దూరాన్ని 9.55 సెకన్ల తో పూర్తి చేయటం ఇప్పుడు పెను సంచలనం గా మారింది.
ఎందుకంటే.. వంద మీటర్ల పరుగు పందెంలో ప్రపంచం రికార్డు ఊసేన్ బోల్ట్ పేరిట ఉంది. 2009 బెర్లిన్ లో నిర్వహించిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్ షిప్ లో తన లక్ష్యాన్ని కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో పోలిస్తే.. తాజాగా శ్రీనివాస్ గౌడ్ సాధించిన రికార్డు మరింత మెరుగైనది. దీంతో.. అతడికి సరైన శిక్షణ ఇప్పించి ఒలంపిక్స్ కు పంపితే.. పతకాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.
ఇంతకీ శ్రీనివాస్ గౌడ ఎవరంటే.. మంగళూరుకు దగ్గర్లోని మూడబిద్రి శివారులోని మియారు గ్రామానికి చెందిన వాడు. నిరేపేద కుటుంబానికి చెందిన అతడు పదో తరగతి వరకూ చదువుకున్నాడు. తన పద్దెనిమిదో ఏట నుంచి కంబళ లో పాల్గొంటున్నారు. తాను తీసిన పరుగు గురించి వస్తున్న ప్రచారం శ్రీనివాస్ కు అస్సలు అర్థం కావటం లేదు. తాను చేసిందేమీ లేదని.. కేవలం తన దున్నలతో పోటీ పడి పరిగెత్తినట్లుగా చెబుతున్నాడు. అయితే.. అతని వేగం ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చగా మారింది. మరీ.. కంబళ వీరుడ్ని ప్రభుత్వం గుర్తించి.. ప్రజలు కోరినట్లుగా అథ్లెట్ గా తయారు చేస్తుందా? ఆ దిశగా ఆలోచించేటోళ్లు క్రీడాధికారుల్లో ఎవరైనా ఉన్నారా? అన్నది అసలు క్వశ్చన్.