Begin typing your search above and press return to search.
కూచిబొట్ల హంతకుడికి జీవితఖైదు..భార్య స్పందన
By: Tupaki Desk | 6 May 2018 5:34 AM GMTహైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్లను జాతి వివక్షతో కాల్చి చంపిన హంతకుడు - అమెరికా మాజీ నావికాదళ అధికారి ఆడమ్ ప్యూరింటన్ (52)కు తగిన శాస్తి జరిగింది. ఆయనకు జీవిత ఖైదుతో పాటు మరో ఊహించని శిక్షను సైతం జడ్జి విధించారు. గతేడాది ఫిబ్రవరి 22న కాన్సాస్ లోని ఒలాథే సిటీలో ఒక బార్ లో ఉన్న శ్రీనివాస్ కూచిభొట్లపై ఆడమ్ ప్యూరింటన్ జాతి వివక్ష ప్రదర్శిస్తూ ‘నా దేశం నుంచి వెళ్లిపో’ అని బిగ్గరగా అరుస్తూ కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పారిపోతున్న ప్యూరింటన్ ను పట్టుకునేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్ కూచిభొట్ల స్నేహితుడు అలోక్ మాడసాని - ఇరోన్ గ్రిల్లోట్ లపైనా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కూచిభొట్ల తర్వాత మృతి చెందారు. ప్యూరింటన్ పై కేసు నమోదు చేసిన కాన్సాస్ లోని అమెరికా అటార్నీ అధికారులు.. అతడు ద్వేషపూరిత నేరానికి పాల్పడినట్లు గత జూన్ లో అభియోగాలు నమోదు చేశారు. ఆడమ్ ప్యూరింటన్ తొలుత నేరాన్ని అంగీకరించేందుకు నిరాకరించాడు. కానీ గత మార్చిలో నేరాన్ని అంగీకరిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ సమర్పించాడు.
ఈ పిటిషన్ పై అమెరికాలోని కాన్సాస్ ఫెడరల్ జడ్జి జేమ్స్ చార్లెస్ డ్రైజ్ శుక్రవారం జీవిత కాల ఖైదు విధించారు. శ్రీనివాస్ కూచిభొట్ల స్నేహితుడు అలోక్ మాడసాని - ఇరోన్ గ్రిల్లోట్ లపై కాల్పులు జరిపినందుకు రెండు హత్యాయత్నం కేసుల్లో 165 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. దీని ప్రకారం మొత్తం మూడు కేసుల్లో కలిపి ఆడమ్ ప్యూరింటన్ సుమారు 78 ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు.. అతడికి నూరేళ్లు నిండే వరకు పెరోల్ ఇవ్వరాదని జడ్జి ఆదేశించారు. ఇదే కేసులో ద్వేషపూరిత నేరానికి పాల్పడినట్లు ఆడమ్ ప్యూరింటన్‌పై నమోదైన అభియోగాల మీద కేసు పెండింగ్‌లో ఉంది. దీనిపై నేరాన్ని అంగీకరిస్తూ అతడు దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 21న విచారణకు రానుంది.
ఇదిలాఉండగా...ఆడమ్ ప్యూరింటన్‌కు జీవితకాల శిక్ష విధిస్తూ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమాలా స్వాగతించారు. ‘కాన్సాస్ ఫెడరల్ కోర్టు తీర్పు హత్యకు గురైన నా భర్తను తిరిగి తీసుకు రాలేదు. కానీ ద్వేషం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపింది’ అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ‘దోషిని చట్టం ముందు నిలిపేందుకు కృషి చేసిన ఓలాథే పోలీసులు, జిల్లా అటార్నీ ఆఫీసు అధికారులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె న్యాయస్థానానికి తన వాంగ్మూలాన్ని సమర్పించారు. శ్రీనివాస్ కూచిభొట్ల హైదరాబాద్ లోని జేఎన్టీయూలో డిగ్రీ - ఎల్ పాసోలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లో పీజీ పట్టా అందుకున్నారు. మృతి చెందే నాటికి జీపీఎస్ మేకర్ గార్మిన్ లో ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీర్ అండ్ ప్రోగ్రామ్స్ మేనేజర్ గా పని చేస్తున్నారు.