Begin typing your search above and press return to search.
విచారణకు వచ్చేసిన ఆదికేశవుల కొడుకు
By: Tupaki Desk | 18 Aug 2015 8:42 AM GMTఓటుకు నోటు కేసులో కీలకంగా మారిన రూ.50లక్షలకు సంబంధించిన అంశానికి సంబంధించి అనూహ్యంగా తెరపైకి పేరొచ్చిన తెలుగుదేశం నేత.. దివంగత ఆదికేశవుల నాయుడి కుమారుడు శ్రీనివాసుల నాయుడు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ.50లక్షలు ఇవ్వజూపిన మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై గత కొద్దిరోజులుగా టీ ఏసీబీ బుర్రబద్ధలు కొట్టుకుంటోంది. అయితే.. దీనికి సంబంధించి.. తమకు కొన్ని ఆధారాలు లభించాయని..దివంగత ఆదికేశవుల నాయుడి కుమారుడు శ్రీనివాసనాయుడు.. ఆయనకు సన్నిహితుడు.. ఆఫీసు కార్యదర్శి అయిన విష్ణుచైతన్యకు టీ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
శ్రీనివాసనాయుడు ఇండియాలో లేరని.. ఆయన.. స్విట్జర్లాండ్ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ.. అందుకు భిన్నంగా.. మంగళవారం ఉదయం టీ ఏసీబీ అఫీసుకు ఆయన చేరుకున్నారు. ఆయన వెంట.. విష్ణుచైతన్య కూడా ఉన్నారు. రూ.50లక్షలకు సంబంధించి ఆయన ద్వారా వివరాలు సేకరించాలని టీ ఏసీబీ భావిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే కేసుకు సంబంధించి గతంలోనే నోటీసులు జారీ చేసిన మత్తయ్య.. జిమ్మిబాబు.. లోకేశ్ డ్రైవర్ కొండల్ రెడ్డిలు ఇప్పటివరకూ హాజరుకాకపోగా.. నోటీసులు అందిన వెంటనే.. శ్రీనివాసనాయుడు.. విష్ణుచైతన్యలు మాత్రం టీ ఏసీబీ అధికారుల వద్దకు రావటం గమనార్హం. మరి.. విచారణలో.. ఏదైనా కొత్త విషయాల్ని టీ ఏసీబీ బయటకు తీసుకొస్తుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.