Begin typing your search above and press return to search.

ఆర్టీసీ స‌మ్మె.. ఆ మంత్రిపై డౌట్లు వ‌చ్చేస్తున్నాయ్‌...!

By:  Tupaki Desk   |   11 Oct 2019 9:15 AM GMT
ఆర్టీసీ స‌మ్మె.. ఆ మంత్రిపై డౌట్లు వ‌చ్చేస్తున్నాయ్‌...!
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఉధృతంగా సాగుతున్న వేళ‌.. గురువారం నాడు అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై అటు ఉద్యోగ‌వ‌ర్గాల్లో - ఇటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన జ‌రుగుతోంది. ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు ఉపాధ్యాయులు - ఉద్యోగ సంఘాలు మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ద్ద‌తుగా పెన్‌ డౌన్ కూడా చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో టీఎన్జీవో - టీజీవోల సంఘాల నేత‌లు కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌ల‌తో భేటీ కావాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా వారికి సీఎం కార్యాల‌యం నుంచి పిలుపురావ‌డంతో.. టీఎన్జీవో - టీజీవో నేత‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి.. సీఎం కేసీఆర్‌ ను క‌లిశారు.

ఆర్టీసీ కార్మిక నేత‌ల‌తో భేటీని ర‌ద్దు చేసుకుని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు వెళ్లి కేసీఆర్‌ ను క‌ల‌వ‌డంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్క‌డ వారితో మంత్రి శ్రీ‌నివాస్‌ గౌడ్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

టీఎన్జీవోల సంఘం అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు కారం ర‌వీంద‌ర్‌ రెడ్డి - రాజేంద‌ర్ - టీజీవోల సంఘం మ‌మ‌త‌ - స‌త్య‌నారాయ‌ణ‌ - నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు జ్ఞానేశ్వ‌ర్ సీఎం కేసీఆర్ ను క‌లిశారు. అయితే వీరి వెంట మంత్రి శ్రీ‌నివాస్‌ గౌడ్ ఉన్నారు. హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని - క‌లిసి కూర్చొని మాట్లాడుకుందామ‌ని సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేత‌గా శ్రీ‌నివాస్‌ గౌడ్ కీల‌క పాత్ర పోషించారు. దాని నుంచి ఎమ్మెల్యే టికెట్ పొందడం, గెల‌వ‌డం.. ఇప్పుడు రెండోసారి గెలిచి - ఏకంగా ఆయ‌న మంత్రి అయ్యారు. తాజాగా.. ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న క‌ద‌లిక‌లపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు మ‌ద్దతుగా ఉద్యోగ సంఘాల నిల‌వ‌కుండా మంత్రి శ్రీ‌నివాస్‌ గౌడ్ ప్ర‌య‌త్నం చేస్తున్నారా..? ఆర్టీసీ కార్మికులను ఒంట‌రి చేసి - వారి మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసేందుకు పూనుకుంటున్నారా..? సీఎం కేసీఆర్ వ‌ద్ద మార్కులు కొట్టేసేందుకే ఇలా చేస్తున్నారా..? అనే ప్ర‌శ్న‌లు ఉద్యోగ‌వ‌ర్గాల్లో ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

అంతేగాకుండా.. 35 రోజుల ముందు స‌మ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికుల‌తో స‌మావేశం కావ‌డానికి సీఎం కేసీఆర్‌ కు స‌మ‌యం దొర‌క‌లేదుగానీ.. ఒక్క‌సారిగా టీఎన్జీవోలు - టీజీవోల నేత‌ల‌ను పిలుపించుక‌ని మ‌రీ మాట్లాడ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది అంద‌రిలో ఆస‌క్తిని రేపుతున్న‌ది. ఇక్క‌డే మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప‌రిష్కారం కోసం ఇలా టీఎన్జీవో - టీజీవో నేత‌ల‌ను మంత్రి శ్రీ‌నివాస్‌ గౌడ్‌ ను మ‌ధ్య‌వ‌ర్తిగా పెట్టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలిపించారా..? అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్న‌మ‌వుతోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..?