Begin typing your search above and press return to search.
తమ్ముళ్లు.. ఈ ఫోటో మాటేంది?
By: Tupaki Desk | 26 Oct 2018 9:45 AM GMTవిశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ ను జగన్ వీరాభిమానిగా చిత్రీకరించటం.. జగన్ తో ఉన్నారంటూ ప్రచారంలోకి తెచ్చిన ఫ్లెక్సీ ఫోటోలన్నీ ఉత్త బూటకమేనన్న వాదన జోరు అంతకంతకూ పెరుగుతోంది. శ్రీనివాస్ ను జగన్ వీరాభిమాని అనేందుకు వీలుగా చిత్రవిచిత్రమైన చిందులు వేస్తున్నతెలుగు తమ్ముళ్ల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా నిందితుడు శ్రీనివాస్ కు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో టీడీపీ కండువా వేసుకున్న శ్రీనివాస్ ఫోటో బయటకు వచ్చింది. ఇంతకాలం జగన్ వీరాభిమానిగా ప్రచారం చేసిన తెలుగు తమ్ముళ్లు.. తాజా ఫోటోకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ ఏపీ అధికారపక్షానికి చెందిన కార్యకర్తగా పలువురు చెబుతున్నారు. శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త అని.. అతడి సొంతూరు వాసులు పేర్కొనటం గమనార్హం. శ్రీనివాస్ ది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంక. అయితే.. శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త అంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తుంటే.. తాజాగా శ్రీనివాస్ సోదరుడు మాత్రం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము టీడీపీలో ఉన్నట్లుగా చెప్పటం ఆసక్తికరంగా మారింది.
ఓపక్క శ్రీనివాస్ సోదరుడి మాట.. మరోవైపు శ్రీనివాస్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చాయి. అంతేకాదు.. శ్రీనివాస్ కు ఊళ్లో నేర చరిత్ర ఉందన్న మాటను పలువురు చెబుతున్నారు. ఊళ్లో మంచి పేరులేని వ్యక్తికి ఎయిర్ పోర్ట్ లో ఎలా ఉద్యోగం ఇచ్చారన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. మరి.. శ్రీనివాస్ మెడలో టీడీపీ కండువాతో ఉన్న ఫోటోపై తెలుగు తమ్ముళ్లు ఏమని బదులిస్తారని ప్రశ్నిస్తున్నారు.