Begin typing your search above and press return to search.

బాబు.. చిన‌బాబుల‌తో శ్రీ‌నివాస్ ఫోటోల మాటేంటి?

By:  Tupaki Desk   |   26 Oct 2018 8:17 AM GMT
బాబు.. చిన‌బాబుల‌తో శ్రీ‌నివాస్ ఫోటోల మాటేంటి?
X
జ‌గ‌న్ మీద దాడి చేసింది ఎవ‌రో తెలుసా?.. జ‌గ‌న్ వీరాభిమాని అట‌. జ‌గ‌న్ కోసం ఐదు అడుగుల ఫ్లెక్సీ కూడా పెట్టించాడ‌ట‌. మా అన్న జ‌గ‌న్ త‌ర్వాతి సీఎం తెలుసా అంటూ త‌ర‌చూ చెప్పేవాడు. ఇలా.. కొన్ని నిజాల్ని.. మ‌రికొన్ని నిజాలు అనిపించేలా జోరు ప్ర‌చారం సాగ‌టం తెలిసిందే. జ‌గ‌న్ పై కోడి పందాల క‌త్తితో దాడి చేసిన శ్రీ‌నివాస్ ను ఎంత‌సేప‌టికి జ‌గ‌న్ వీరాభిమానిగా చిత్రీక‌రించ‌టం.. ఆయ‌న్ను జ‌గ‌న్ ఫ్యాన్ గా చెప్ప‌టం ద్వారా ఇష్యూను మ‌రో దిశ‌గా పంపే ప్ర‌య‌త్నం నిన్న‌టి నుంచి మహా జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

తాము వినిపిస్తున్న వాద‌న‌కు బ‌లం చేకూరే ఫోటోలు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేయ‌టం ద్వారా.. చూశారా.. మేం చెప్పింది నిజ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే..జ‌గ‌న్ వీరాభిమానిగా ప్ర‌చారం చేస్తున్న తెలుగు త‌మ్ముళ్లు.. ఒక అడుగు ముందుకేసి..వైఎస్ జ‌గ‌న్ తో శ్రీ‌నివాస్ గ్రీటింగ్ ఫోటోల్్ని తాజాగా తెర మీద‌కు తెచ్చారు.

తాము తీసుకొచ్చిన ఆధారాల్ని త‌మ అనుకూల మీడియాతో ఉద‌ర‌గొట్టేస్తున్న తెలుగు త‌మ్ముళ్లు.. సోష‌ల్ మీడియాలో త‌మ‌కు ఇబ్బంది క‌లిగించే ఫోటోల విష‌యం మాత్రం పెద‌వి విప్ప‌టం లేదు. జ‌గ‌న్ ఫోటోతో త‌న ఫోటోను జ‌త‌చేర్చి శుభాకాంక్ష‌ల‌గ్రీటింగ్స్ ను త‌యారు చేయించాడు. వీటిని ప్ర‌ముఖంగా చూపించే టీడీపీ నేత‌లు.. అదే శ్రీ‌నివాస్ చంద్ర‌బాబు.. లోకేశ్ బాబుల‌తో కూడిన గ్రీటింగ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో య‌మా జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. కానీ.. వీటిపై మాత్రం తెలుగు త‌మ్ముళ్లు పెద‌వి విప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మాట్లాడితే అన్ని ఫోటోల గురించి మాట్లాడాలి. కానీ.. అందుకు భిన్నంగా త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఫోటోల గురించి మాట్లాడుతున్న తీరుపై మాత్ర‌మే మాట్లాడే ధోర‌ణిని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.