Begin typing your search above and press return to search.
మైలాపూర్ నుంచి శ్రీప్రియ పోటీ ... విజయం వరించేనా ?
By: Tupaki Desk | 18 March 2021 1:11 PM GMTతమిళనాడు లో త్వరలో జరగబోయే ఎన్నికలపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. దీనికి ప్రధాన కారణం కరుణానిధి , జయలలిత వంటి పొలిటికల్ స్టార్స్ లేకుండా జరగబోయే మొదటి ఎన్నికలు ఇవే కావడం అలాగే , బీజేపీతో అన్నాడీఎంకే , కాంగ్రెస్ తో డీఎంకే పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగారు. ఇక కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం తమిళనాడు లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. ఇక ఈ ఎన్నికల్లో పలువురు స్టార్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక కమల్ హాసన్ పార్టీ స్థాపించిన సమయంలో కమల్ వెంట నడిచిన శ్రీప్రియ, పార్టీ కోర్ కమిటీ మెంబర్ గానూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో శ్రీప్రియ మైలాపూర్ అసెంబ్లీ నుండీ పోటీ చేస్తోంది. అలానే మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఉండి ఆ మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్న కుష్బూ థౌజండ్ లైట్స్ శాసనసభ నుండి బరిలో నిలిచింది.
ఇకపోతే , కమల్ హాసన్ , శ్రీప్రియ కలిసి చాలా చిత్రాలలో జంటగా నటించారు. మరీ ముఖ్యంగా 'వయసు పిలిచింది, ఎత్తుకు పై ఎత్తు, అల్లాఉద్దీన్ అద్భుతదీపం, సవాల్' వంటి సినిమాలైతే అప్పట్లోఇండస్ట్రీని ఊపేశాయి. ఈసారి తమిళనాడులో డీఎంకే పార్టీకే అధికారపీఠం దక్కుతుందనే ప్రచారం బాగా సాగుతున్న సమయంలో ఈ సీనియర్ నటీమణులు తమ అదృష్టం పరీక్షించుకోవడం కాస్తంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో విషయం ఏమంటే శ్రీప్రియ రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చిన కారణంగానే దృశ్యం -2 తెలుగు రీమేక్ దర్శకత్వంకు దూరంగా ఉందనే ప్రచారమూ జరుగుతోంది.గతంలో మలయాళ 'దృశ్యం' తెలుగు రీమేక్ ను శ్రీప్రియనే డైరెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి మాతృకకు దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ వచ్చాడు. మంచి సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం వదులకుని, ఎన్నికల బరిలో నిలిచిన శ్రీప్రియకు ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో చూడాలి.