Begin typing your search above and press return to search.
బాబాయ్ బాలయ్య డైరెక్టర్ కు అబ్బాయ్ ఓకే..!
By: Tupaki Desk | 14 July 2016 8:22 AM GMTలక్ష్యం సినిమాతో కేరీర్ స్టార్ట్ చేసిన శ్రీవాస్ తన కేరీర్ లో చేసింది ఐదు సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. శ్రీవాస్ సినిమాల్లో కామెడీ టైమింగ్ - యాక్షన్ సీన్లు - ఎమోషనల్ సీన్లు మిక్స్ అయ్యి ఉంటాయి. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన డిక్టేటర్ సినిమాతో బాలయ్యను డైరెక్ట్ చేసిన శ్రీవాస్ ఈ సినిమా తర్వాత మరో నందమూరి హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బాబాయ్ డైరెక్టర్ శ్రీవాస్ తో పనిచేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.
డిక్టేటర్ తర్వాత శ్రీవాస్ ఓ మాస్ సబ్జెక్టును రెడీ చేసుకుని గోపీచంద్ కు వినిపించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో లక్ష్యం - లౌక్యం సినిమాలు వచ్చి హిట్ అవ్వడంతో మూడోసారి కూడా వీరి కాంబో హిట్ అయ్యి హ్యాట్రిక్ కొడుతుందని అందరూ భావించారు. శ్రీవాస్ స్టోరీని గోపీచంద్ ఓకే చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే గోపీచంద్ మాత్రం సంపత్ నందికి ఓటేశాడట. దీంతో అదే స్టోరీని శ్రీవాస్ కళ్యాణ్ రామ్ కు వినిపించగా కళ్యాణ్ ఓకే చెప్పాడని టాక్.
ప్రస్తుతం కళ్యాణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న ఇజం సినిమా దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇజం షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే శ్రీవాస్-కళ్యాణ్ రామ్ మూవీ పట్టాలెక్కే ఛాన్సుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తాడని తెలుస్తోంది. బాలయ్యను డిక్టేటర్ గా చూపించి సక్సెస్ అయిన శ్రీవాస్ అబ్బాయ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.