Begin typing your search above and press return to search.

PUBG పేరుతో పదో తరగతి హాల్ టిక్కెట్లు ..కాపీ కొట్టిస్తూ అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్!

By:  Tupaki Desk   |   20 March 2020 3:35 AM GMT
PUBG పేరుతో పదో తరగతి హాల్ టిక్కెట్లు ..కాపీ కొట్టిస్తూ అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్!
X
తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డ్ డొల్లతనం మరోసారి బయటపడింది. తరచుగా హాల్ టికెట్స్ లో హీరో - హీరోయిన్స్ ఫొటోస్ వస్తున్నాయి. అయితే తాజాగా పబ్జి (pubg)పేరుతొ హాల్ టికెట్ డౌన్ లోడ్ కావడంతో అధికారులు అవాక్కయ్యారు. పదో తరగతి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో సాంకేతిక లోపం కారణంగా వ 2022114399 అనే అకౌంట్ నెంబర్‌ తో హిదాయత్ పబ్జీ అనే హాల్ టిక్కెట్ దర్శనమిచ్చింది. ఈ హాల్ టికెట్ లోని తప్పుని గుర్తించిన అధికారులు .. పరీక్ష మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు ఆ హాల్ టిక్కెట్ ను క్యాన్సిల్ చేశారు. దీనిపై తెలంగాణ డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ సత్యనారాయణ రెడ్డి స్పందిస్తూ ..ఈ విషయం తెలిసిన వెంటనే వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్ తీసేసినట్లు వెల్లడించారు.

ఇకపోతే , టోలీచౌకీలోని న్యూ మదీనా జూనియర్ కాలేజీ 8మంది విద్యార్థులను బుధవారం హైపవర్ కమిటీ రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకుంది. ప్రిన్సిపాల్ షోయబ్ తన్వీర్ - స్టాఫర్లు షాబా - షహీదా షరీన్ - సయ్యద ఖలీముద్దీన్‌ లను పోలీసులు అరెస్టు చేశారు. కాపీ కొడుతూ పట్టుబడ్డ 8మంది విద్యార్థుల్లో నలుగురిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు మైనర్లుకావడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఎగ్జామ్ హాల్‌ కు వెళ్లేసరికి 8మంది విద్యార్థులు కాపీ కొడుతూ కనిపించారు. ఇందులో ప్రిన్సిపాల్ ప్రమేయం కూడా ఉందని జిల్లా ఇంటర్మీడియల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జయప్రద బై తెలిపారు.

మూడురోజులుగా ఇలా జరుగుతున్నట్లు తెలుసుకున్న మేం దాడి చేశాం. మూడు పరీక్షలకు విద్యార్థులకు సమాధానాలు కూడా చెప్తున్నట్లు తెలియడంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగాం అని తెలిపారు. కాలేజీ యజమాన్యం 3రోజుల్లోగా వివరణ ఇవ్వాలని న్యూ మదీనా కాలేజీకు నోటీసులు పంపినట్లు టీఎస్బీఐఈ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసి.. ఈ మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం.