Begin typing your search above and press return to search.
ఇన్ స్టాలో ప్రొఫెసర్ బికినీ పిక్.. ఉద్యోగం తీసిన వర్సిటీ.. సోషల్ మీడియాలో కొత్త రచ్చ
By: Tupaki Desk | 10 Aug 2022 6:02 AM GMTపశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాకు చెందిన ప్రముఖ సెయింట్ జేవియర్స్ వర్సిటీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రచ్చకు తెర తీసింది. ఆకర్షణీయమైన జీతం.. బోలెడన్ని సదుపాయాలతో పాటు.. పేరు ప్రఖ్యాతులున్న వర్సిటీలో ఉద్యోగం ఉన్నప్పటికీ..సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ తన ప్రైవేటు ఇన్ స్టాలో పోస్టు చేసుకున్న బికినీ ఫోటో ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది.
ఆమె ఉద్యోగాన్ని బలవంతంగా తీసేయటమే కాదు.. విశ్వవిద్యాలయ పరువు తీసినందుకు ఆమె రూ.99 కోట్లు చెల్లించాలంటూ ఫర్మానా జారీ చేయటాన్ని ఆమె తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా రిపోర్టుకావటం.. సోషల్ మీడియాలో దీనిపై ఇప్పటికే హాట్ హాట్ గా చర్చ షురూ అయ్యింది.
గత ఏడాది అక్టోబరులో జరిగిన ఈ వ్యవహారం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. అసలీ రచ్చకు కారణం ఒక విద్యార్థిగా చెబుతున్నారు. తమ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ స్టాలో షేర్ చేసిన బికినీ ఫోటోను.. తన పద్దెనిమిదేళ్ల కొడుకు తదేకంగా చూస్తున్నాడని.. ఇదెక్కడి పద్దతి? అని ప్రశ్నించటంతో పాటు గౌరవనీయ స్థానంలో ఉన్న అధ్యాపకులు ఇలాంటి ఫోటోలు పోస్టు చేస్తారా? అంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన వర్సిటీ అధికారులు ఆమె చేత బలవంతంగా రాజీనామా చేయించారు. రూ.99 కోట్ల పరిహారానికి డిమాండ్ చేస్తున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత సదరు ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రైవేటు ఇన్ స్టా అకౌంట్లో లోడ్ చేసిన ఫోటోను.. ఎలా చూస్తారని? దాన్ని హ్యాక్ చేశారంటూ ఆమె కంప్లైంట్ చేశారు. వర్సిటీకి ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రిని బీకే ముఖర్జీగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే..ఈ ఎపిసోడ్ కు సంబంధించిన సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ వాదన మరోలా ఉంది. తాను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసిన ఫోటో ఇప్పటిది కాదని.. తాను వర్సిటీలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టడానికి ముందే తాను అప్ లోడ్ చేసినట్లుగా వాదిస్తున్నారు. తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందన్నది ఆమె వాదన. వర్సిటీ తీసుకున్న నిర్ణయం లైంగిక వేధింపులు.. ఉద్దేశపూర్వక హత్యగా ఆమె అభివర్ణిస్తున్నారు. చేయని తప్పునకు తనకు శిక్ష విధించారని.. తాను న్యాయపోరాటం చేస్తామని ఆమె చెబుతున్నారు.
ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. పలువురు ప్రొఫెసర్ పక్షాన నిలిచి వాదనలు వినిపిస్తుంటే.. మరికొందరు అధ్యాపక వ్రత్తిలో ఉండి ఇలా ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు.