Begin typing your search above and press return to search.
పన్నీర్ కాదు.. శశికళ కాదు.. స్టాలినే సీఎం?
By: Tupaki Desk | 10 Feb 2017 11:56 AM GMTఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారంటూ కొత్త అమ్మ శశికళ.. ఎమ్మెల్యేలు శశికళ నిర్బంధంలో ఉన్నా వారి మద్దతు తనకేనంటున్న జయ విధేయుడు, తన వర్గీయులు అన్నగా పిలుచుకునే పన్నీర్ సెల్వం చెబుతున్న వేళ తమిళ పాలిటిక్సులో కొత్త ఈక్వేషన్ ఒకటి మొదలైంది. అది ప్రతిపక్షానికి చెందిన తమిళ ‘అబ్బాయి’ స్టాలిన్ గీసిన స్కెచ్ అని చెబుతున్నారు. అన్నాడీఎంకేలో శశికళ - పన్నీర్ లు నేనంటే నేనని కొట్టుకుంటున్న వేళ స్టాలిన్ ఏకంగా 15 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారని తెలుస్తోంది.
దీంతో ఈ రోజు గవర్నరు విద్యాసాగరరావు ఏదో ఒకటి తేల్చే ఛాన్సు ఉందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా సీను మారిపోయింది. పన్నీర్ కు డీఎంకే మద్దతు దొరుకుతుందనుకుంటున్న తరుణంలో ఏకంగా డీఎంకేయే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొంటోందన్న వార్తల నేపథ్యంలో రాజకీయం యూ టర్ను తీసుకుంటోంది. అటు పన్నీర్ - ఇటు శశికళ కాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని తాను ఎగరేసుకుపోవాలని స్టాలిన్ స్కెచ్ గీసినట్లుగా తెలుస్తోంది.
నిజానికి డీఎంకేకు 89 మంది సభ్యుల బలం ఉంది. 235 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో 118 మంది ఉంటే సీఎం కావొచ్చు. అంటే స్టాలిన్ కు ఇంకా 29 మంది అవసరం. కానీ.. కాంగ్రెస్ కు ఉన్న 8 మంది.. ఒక స్వతంత్ర సభ్యుడిని కూడా స్టాలిన్ టచ్ లోకి తీసుకున్నారని టాక్. అంటే ఇంకా 20 మంది ఉంటే చాలు. ప్రస్తుతం 15 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ వెంట ఉన్నారన్న వార్తలతో మరో అయిదుగురిని తీసుకుంటే పదవి స్టాలిన్ కు దక్కడం ఖాయమన్న వాదన వినిపిస్తుంది. అప్పుడు పన్నీర్ - శశిల కొట్లాటలతో అన్నా డీఎంకే నాలుగున్నరేళ్ల ముందుగానే అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి రావొచ్చు.
పార్టీలో పన్నీర్ సెల్వం - శశికళ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో తాము విసిగిపోయామని... అందుకే తాము డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నామని 15 మంది ఎమ్మెల్యేలు చెబుతున్నట్టుగా సమాచారం. ఇదే నిజమైతే శశికళ - పన్నీర్ లు ఇద్దరూ చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం. స్టాలిన్ రాజకీయ ఎత్తుగడే కనుక సక్సెస్ అయితే.. వచ్చే ఎన్నికల్లో అమ్మపై సానుభూతిని దాటి గెలుస్తామో లేదో అనుకుంటున్న కరుణానిధికి కొడుకును సీఎంగా చూడాలన్న కల తీరిపోయినట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/