Begin typing your search above and press return to search.

బీజేపీకి కన్ను గీటుతున్న స్టాలిన్?!

By:  Tupaki Desk   |   14 May 2019 11:07 AM GMT
బీజేపీకి కన్ను గీటుతున్న స్టాలిన్?!
X
ఇది రాజకీయం - ఇదీ రాజకీయం! ఎప్పుడు ఎవరు ఎటు మొగ్గు చూపుతారో చెప్పలేని పరిస్థితి. మొన్నటి వరకూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి - మోడీ మళ్లీ ప్రధాని కావాలంటూ తీర్మానాలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ అంటే ఒంటికాలి మీద లేస్తూ ఉన్నారు! మోడీ మీద రోజూ దుమ్మెత్తిపోయడమే చంద్రబాబు నాయుడి పని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడిగా సాగుతూ ఉన్నాడాయన.

అయితే రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీయేలోకి చేరడని - వారు అధికారం లోకి వస్తే మళ్లీ బీజేపీకి దగ్గర కాడు అని ఎవ్వరూ చెప్పలేరు. ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా ఆ మాట ఇప్పుడు చెప్పలేడు!

ఆయనే కాదు.. ఇప్పుడు ఎంకే స్టాలిన్ కథ కూడా ఇలానే ఉంది. ఒకవైపు తమిళనాట డీఎంకే- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. చెరి కొన్ని ఎంపీ సీట్లను ఎంచుకుని పొత్తుతో పోటీ చేశాయి. వీరికి ప్రత్యర్థులుగా బీజేపీ-అన్నాడీఎంకేలు కలిసి పోటీ చేశాయి.

మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. స్టాలిన్ మద్దతు యూపీఏకే ఉండాలి. కానీ ఇప్పుడు స్టాలిన్ కు అవసరం అలాంటి నైతికత కాదు. అధికారం. ఇప్పటికే డీఎంకే అధికారానికి దూరమై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రంలోనో - రాష్ట్రంలోనో కచ్చితంగా అధికారం చేతిలో ఉండాలి. రాష్ట్రంలో రాజ్యం చక్కగా చలాయించాలన్నా కేంద్రంలో అధికారం కావాల్సిన పరిస్థితి ఉందిప్పుడు.

ఈ నేపథ్యంలో.. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వచ్చే పక్షంలో అటు వైపు జంప్ చేయడానికి కూడా స్టాలిన్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు సంప్రదింపులు జరిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ దోస్తీకే స్టాలిన్ కట్టుబడి లేడని - కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం అందకపోతే ఆయన బీజేపీ తో చేతులు కలపవచ్చని టాక్!