Begin typing your search above and press return to search.
స్వాగతం పలకటంలోనే సారుకు స్టాలిన్ షాక్!
By: Tupaki Desk | 14 May 2019 3:50 AM GMTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. డీఎంకే అధినేత స్టాలిన్ చర్చల ఎపిసోడ్ ఇప్పుడు గతమైంది. ఒకసారి వాయిదా పడిన తర్వాత.. అనూహ్యంగా సాగిన ఈ సమావేశం గంట పాటు సాగింది. అధికారంలో ఉన్న కేసీఆర్.. అధికారం చేతిలో లేని డీఎంకే అధినేతతో భేటీ కావటం కోసం.. హైదరాబాద్ నుంచి చెన్నైకి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరీ వచ్చారంటే.. ఇక్కడ ఎవరికి ఇంట్రస్ట్ ఎక్కువన్నది ఇట్టే అర్థమైపోతుంది. తొలుత తమిళనాడులో పవర్ చేజిక్కించుకోవటంపైనే డీఎంకే అధినేత తేల్చి చెప్పగా.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
సారు.. స్టాలిన్ భేటీ విషయంలో.. కడుపు నిండిన మహారాజు సారు అయితే.. అధికారం కోసం ఆవురావురమంటున్న స్టాలిన్ అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నారు. తొలుత తమిళనాడు పగ్గాలు చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమన్న విషయంపై స్టాలిన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తమిళనాడు సీఎం పదవి తర్వాతే.. దేశంలో మరే పదవి అయినా అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ కారణంతోనే కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను ఆయన్ను లైట్ తీసుకోవటం కనిపిస్తుంది.
వాస్తవానికి వీరి భేటీ ఎలా సాగుతుందన్న విషయాన్ని కేసీఆర్ కు స్వాగతం పలికే సందర్భంలోనే స్టాలిన్ తన చేతలతో చూపించేశారు. పార్టీ ముఖ్యులతో కలిసి.. కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు బయటకు వచ్చిన ఆయన.. గోడ దగ్గరే ఉండిపోయారు. వీరి భేటీకి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే.. పార్టీ ముఖ్యలతో కలిసి.. ఇంటి బయట..గోడకు పక్కనే వెయిట్ చేశారే తప్పించి.. కారు దగ్గరకు వెళ్లింది లేదు.
కేసీఆర్ కారు వచ్చేస్తున్న సమయంలోనూ గోడ వద్ద ఉన్న స్టాలిన్.. కేసీఆర్ కారును కారిడార్ లోపలకు తీసుకురావాలన్న మాటను సైగతో చెప్పారు. అప్పటికే కారు ఆగటం.. అందులో నుంచి కేసీఆర్ దిగటం జరిగిపోయాయి. దీంతో.. అక్కడే ఉన్న ఆయన.. బాగోదని అనుకున్నారేమో కానీ.. మూడు.. నాలుగు అడుగులు కూడా వేయలేదు. అంతలోనే కేసీఆర్ రావటం.. తాను తెచ్చిన బొకేను స్టాలిన్ కు ఇచ్చారు. ఇలా.. వెల్ కం ఎంట్రీలోనే ఏదో తేడా కొట్టినట్లుగా ఉన్న స్టాలిన్ తీరు.. భేటీ తర్వాత ఏం జరిగిందన్నది బయటకు రావటం తెలిసిందే.