Begin typing your search above and press return to search.
శశికళ పక్కనే 10 మర్డర్ల దోషి..స్టాలిన్ ట్విస్ట్
By: Tupaki Desk | 17 Feb 2017 5:06 PM GMTఅన్నా డీఎంకే అధినేత్రి శశికళకు జైలు జీవితం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. చిన్నమ్మ ఉంటున్న పక్క సెల్లోనే ఆరు హత్యలు చేసిన సైనేడ్ మల్లిక ఉన్నట్లు జైలు అధికారులు చెప్పారు. దేవాలయాల్లో పరిచయమైన ఆరుగురు మహిళలను బంగారం కోసం విషం పెట్టి చంపిన ఆరోపణలు మల్లికపై ఉన్నాయి. అలాంటి మల్లిక తన పక్క సెల్లోనే ఉన్న శశికళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నదని బెంగళూరు మిర్రర్ పత్రిక ఓ కథనం వెలువరించింది. అయితే తొలిరోజు ఆమెతో ఏమాత్రం మాట కలపని శశికళ.. గురువారం ఆమెను చూసి చిరునవ్వు నవ్విందని ఆ పత్రిక తన కథనంలో వెల్లడించింది. తనకు ప్రత్యేక సెల్ - వసతులు కల్పించాలన్న వినతి కోర్టు తోసిపుచ్చడంతో అందరితో కలిసి శశికళ కూడా సాధారణ ఖైదీలాగా జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళకు ఎన్నికల కమిషన్(ఈసీ) నోటీసులు జారీ చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని వ్యతిరేకిస్తూ మైత్రేయన్ పిటిషన్ దాఖలు చేశారు. మైత్రేయన్ దాఖలు చేసిన పిటిషన్ పై నోటీసులు జారీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. ఈ నెల 28 లోపు సమాధానం ఇవ్వాలని శశికళను ఈసీ ఆదేశించింది.
కాగా, విశ్వాసపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేయాలని డీఎంకే నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లిలో బలపరీక్షకు హాజరవుతామన్నారు. అన్నాడీఎంకే మొదటి నుంచి ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, అందుకే పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. కాంగ్రెస్ కూడా మాతో కలిసి వస్తుందని భావిస్తున్నట్లు స్టాలిన్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/