Begin typing your search above and press return to search.

స్టాలిన్ సంచలనం.. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు

By:  Tupaki Desk   |   5 Oct 2021 4:32 AM GMT
స్టాలిన్ సంచలనం.. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు
X
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న తరహాలో పాలనను అందిస్తూ.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. తమిళనాడుకు ఏ మాత్రం సూట్ కాని రీతిలో రాజకీయ ప్రత్యర్థుల్ని కలుపుకు పోయేలా వ్యవహరించే ధోరణి.. ఇప్పటి దూకుడు రాజకీయాల్లో సరికొత్తగా మారింది. ఇదిలా ఉంటే.. గడిచిన కొద్దికాలంగా జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ను ఆయన వ్యతిరేకించే విషయం తెలిసిందే.

తాజాగా ఆయన తన వైఖరిని స్పష్టం చేస్తూ ఆయన.. పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖలు రాశారు. నీట్ ను వ్యతిరేకించటమే కాదు.. విద్యా రంగంలో రాజకీయ ఏకాగ్రతను పొందేందుకు.. అందరూ ఏకతాటి మీద రావాల్సిన అవసరాన్ని గుర్తించే లక్ష్యంతో ఆయనీ లేఖలు రాసినట్లుగా చెబుతున్నారు. ఎన్టీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. ఆయన తన వాదనను ఏపీ.. ఛత్తీస్ గఢ్.. ఢిల్లీ.. జార్ఖండ్.. కేరళ.. మహారాష్ట్ర.. ఒడిశా.. పంజాబ్.. రాజస్థాన్.. తెలంగాణ..పశ్చిమ బెంగాల్ తో పాటు గోవా ముఖ్యమంత్రులకు.. ‘మనంతా ఏకగ్రీవం’ కావటానికి అవసరమైన పరిస్థితుల గురించి ప్రస్తావించారు.

నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానానికి అసెంబ్లీ ఆమోదం పొందటం గమనార్హం. నీట్ ను వ్యతిరేకించటంతో పాటు.. విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు.. తానే స్వయంగా లీడ్ తీసుకున్నారు. నీట్ కు ప్రత్యామ్నాయంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏకే రాజన్ కమిటీ నివేదికను కమిటీ నివేదిక తాను రాసిన లేఖకు జత చేశారు. మొత్తానికి తాను టార్గెట్ చేసిన అంశాన్ని సమయానికి తగ్గట్లుగా తెర మీదకు తీసుకురావటం ద్వారా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.