Begin typing your search above and press return to search.
రోడ్డు మీద నిలబడుతుంది.. వల విసురుతుంది!
By: Tupaki Desk | 27 Jun 2021 11:30 PM GMTమోసాలు పలు రకాలు. అందునా ఆడవాళ్లు చేసే మోసాలు ఊహకు అందకుండా ఉంటాయి. ఇందులో ఒక పద్ధతే.. రోడ్డుపై ఒంటరిగా నిలబడి ప్లాన్ అమలు చేయడం. ఇందులోనూ రకాలు ఉంటాయి. నిర్మానుష్య ప్రదేశంలో సింగిల్ గా ఉండి శృంగారానికి సైగ చేసినట్టుగా పిలిచి, ముఠాతో కలిసి అన్నీ దోచుకొని తరిమేసే పద్ధతి ఒకటి. లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కిన తర్వాత.. అమాయకులపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించి జేబులు ఖాళీ చేయడం రెండో పద్ధతి.
ఈ రెండో పద్ధతిలోనే మోసాలకు పాల్పడుతూ వచ్చింది ఓ కిలేడీ. విజయనగరం జిల్లాకు చెందిన ఈ దొంగ లేడీ.. రోడ్డుపై ఒంటరిగా ఉంటూ.. ద్విచక్రవాహనదారుల కోసం ఎదురు చూసేది. సింగిల్ గా వచ్చే వారిని లిఫ్ట్ అడిగేది. అత్యవసరం ఉందంటూ.. కాస్త ముందు దిగిపోతానంటూ చెప్పి బండి ఎక్కేది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత తన ప్లాన్ అమలు చేసేది.
నీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం ఇవ్వాలని బెదిరించేది. ఇవ్వకపోతే మాత్రం.. తనపై లైంగిక వేధించారని కేసు పెడతానని భయపెట్టేది. అసలే.. ఆడవాళ్ల వ్యవహారం కాబట్టి.. ఎందుకొచ్చిన తంటా అంటూ చేతిలో పెట్టిపోయేవారు అమాయకులు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మందిని దోచుకుంది.
కానీ.. అన్నీ రోజులూ, అందరూ ఒకేలా ఉండరు కదా? ఆ విధంగా ఈ లేడీకి బ్యాడ్ టైమ్ వచ్చేసింది. విశాఖ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని ఇదే విధంగా బ్లాక్ మెయిల్ చేసి రూ.5 వేలు, బంగారు ఉంగరం కాజేసింది. మౌనంగా ఇచ్చేసిన సదరు వ్యక్తి.. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. మద్యానికి బానిసైన ఆ మహిళ.. ఇలా చోరీలకు అలవాటు పడిందని నిర్ధారించారు.