Begin typing your search above and press return to search.
ఇల్లు గడవడానికి.. క్యా బ్ డ్రైవర్ గా మారిన స్టార్ క్రికెటర్!
By: Tupaki Desk | 16 Jun 2021 1:30 AM GMTమనకు తెలిసిన క్రికెటర్ల జీవితం ఎలా ఉంటుంది? కోట్లాది రూపాయల డబ్బు.. లగ్జరీ కార్లు.. ఖరీదైన విల్లాలు.. హబ్బో జీవితం అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఇది నిజమే కూడా. అయితే.. కెరీర్ సక్సెస్ ఫుల్ గా రన్ చేసినవారికే ఇలాంటి భోగభాగ్యాలు వస్తాయి. కానీ.. ఇదే నాణేనికి రెండో కోణం కూడా ఉంటుంది.
రంజీ స్థాయిలోనే ఆగిపోయే ఆటగాళ్లు వేలల్లో ఉంటారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. కొంత కాలానికే కనుమరుగైపోయేవారు ఎంతో మంది ఉంటారు. ఇలాంటి వాళ్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటికే.. విలువైన కాలం కరిగిపోవడం.. వయసు తరిగిపోవడంతో.. దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. కానీ.. చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాతకూడా.. కుటుంబం గడవడానికి క్యాబ్ డ్రైవర్ గా మారాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్!
1997లో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపికైన అర్షద్ ఖాన్.. ఆ జట్టు తరపున 58 వన్డేలు ఆడాడు. 9 టెస్టులు ఆడాడు. 2000 నుంచి 2005 వరకు పాక్ జట్టులో క్లీ ప్లేయర్ గా ఉన్నాడు. ఆ సమయంలో ఇండియా పర్యటనలో సచిన్, సెహ్వాగ్ వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన అర్షద్ ఖాన్.. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
దీంతో.. ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ వెల్లడించాడు. తాను అర్షద్ ఖాన్ ను సిడ్నీలో చూశానని పోస్టు చేశాడు. అతన్ని గుర్తి పట్టి మాట్లాడితే.. తన వివరాలు వెల్లడించాడని, అర్షద్ ఖాన్ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు సదరు వ్యక్తి.