Begin typing your search above and press return to search.

రాజకీయ తారలు.. వాట్ నెక్ట్స్

By:  Tupaki Desk   |   6 May 2019 4:24 AM GMT
రాజకీయ తారలు.. వాట్ నెక్ట్స్
X
ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత సక్సెస్ అయ్యారు. రాష్ట్రాలను ఏలారు. ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ వారి స్ఫూర్తితో వచ్చిన నేతలు మాత్రం నిలదొక్కుకోవడం లేదు.. ప్రభావం చూపడం లేదు.

దేశంలో తారలు రాజకీయాల్లో రావడం ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఇండస్ట్రీని ఏలిన వారంతా తమకు అక్కడ అభిమానులు బ్రహ్మరథం పట్టినట్టే.. బయట కూడా అదే క్రేజ్ ఉంటుందని వచ్చిన వారు ఎందరో.. రాజీవ్ గాంధీ పిలుపుతో 90లో రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్.. ఈ కుల్లు రాజకీయాల్లో ఇమడలేక వైదొలిగారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాల మాట ఎత్తడం లేదు. ఆయన భార్య మాత్రం ఎంపీగా రాజకీయాల్లో కొనసాగుతోంది.

ఇక తెలుగునాట కూడా చిరంజీవి కూడా ప్రజారాజ్యం పేరిట.. ఏపీ రాజకీయాలను ఏలుదామని వచ్చి కుట్రలు - కుతంత్రాలకు బలైపోయారు. రాజకీయాల్లో అథమ స్థాయికి చేరి చివరకు పార్టీని కాంగ్రెస్ లో కలిపి ఇప్పుడు ఆ పార్టీని కూడా వదిలి సినిమాల్లోకి యూటర్న్ తీసుకున్నారు.

ఇక తమిళనాట ప్రస్తుతం కమల్ హాసన్ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసింది. వచ్చే ఉప ఎన్నికల్లోనూ కమల్ పోటీచేస్తున్నారు. కానీ తమిళనాట ఈయన పార్టీకి, కమల్ కు సీట్లురావడం కష్టమనేనని.. ఆ పార్టీది ఫ్లాప్ స్టోరీ అన్న అంచనాలు వచ్చేశాయి..

కమల్ బాటలోనే రజినీకాంత్ కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరి కమల్ ఫెయిల్ అయిన చోట రజినీ ఎంత వరకు పాస్ అవుతాడని వేచిచూడాల్సిందే..

ఆంధ్రాలో పవన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎన్నో ఆశలు - ఆశయాలతో ఏపీ లో తొలిసారి బరిలోకి దిగిన జనసేన ఆశించిస్థాయిలో సీట్లు పొందే అవకాశాలైతే కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అన్ని సర్వేల్లో 5కు మించి జనసేనకు సీట్లు వస్తాయని చెప్పలేదు. మరి ఫలితాల తర్వాత జనసేన స్టెప్ ఏంటి.? పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న సినిమా తారలు.. ప్రస్తుత రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఎంజీఆర్ - ఎన్టీఆర్ తోనే తారల రాజకీయం పరిమితమైపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినీ రాజకీయ నేతలు చిరు బాటలోనే రాజకీయాలు వదిలి మళ్లీ సినిమాల వైపు మళ్లుతారా అన్న చర్చ కూడా సాగుతోంది.