Begin typing your search above and press return to search.
అసెంబ్లీ టికెట్ కోసం ఆడిషన్స్ కు హాజరైన స్టార్ హీరో
By: Tupaki Desk | 7 March 2021 9:30 AM GMTవెండితెర ఇలవేల్పులు రాజకీయ తెరలను ఏలడం ఎప్పుడో మొదలైంది. తెలుగులో ఎన్టీఆర్, తమిళనాట ఎంజీఆర్, జయలలితలు రాజ్యాధికారాన్ని సాధించారు. ఇప్పటికీ చిరంజీవి, పవన్, బాలయ్య, రోజా లాంటి వారు రాజకీయాల్లో ఉన్నారు. ఇక తమిళనాట ఈ వేడి ఇంకాస్త ఎక్కువ.
అక్కడ కమల్ హాసన్, విజయ్, రజినీకాంత్, విజయ్ కాంత్ లాంటి వారు రాజకీయాలపై ఇష్టంతో ఉన్నారు.ప్రస్తుతం తమిళనాట అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్న పార్టీ ‘డీఎంకే’. ఈ క్రమంలోనే డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు , ప్రముఖ తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఈసారి వస్తున్నాడు.
త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని ‘చెపాక్’ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుఫున పోటీచేయడానికి ఉదయనిధి డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే మార్చి 6న పార్టీ పెద్దల ముందు పార్టీ ప్రధాన కార్యాలయంలో టికెట్ కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. పార్టీ అధ్యక్షుడు, తండ్రి అయిన స్టాలిన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ , ఇతర పార్టీ సీనియర్లు ఉదయనిధిని ఇంటర్వ్యూ చేశారు. పార్టీ టికెట్ కోసం కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఇక ఈ హీరోనే కాదు.. ఖుష్బూ, గౌతమి లాంటి వారు కూడా తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీపడుతున్నారు. మరికొంత మంది కూడా బరిలో ఉన్నారు. దీంతో తమిళనాట ఈసారి రాజకీయం సినీ తారల చుట్టే తిరుగుతోంది.