Begin typing your search above and press return to search.

కార్పోరేట్‌ ఆసుపత్రులుగా మారుతున్న స్టార్‌ హోటల్స్‌

By:  Tupaki Desk   |   15 May 2021 12:30 AM GMT
కార్పోరేట్‌ ఆసుపత్రులుగా మారుతున్న స్టార్‌ హోటల్స్‌
X
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న ఈ సమయంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఆసుపత్రులు అన్ని కూడా నిండుకున్నాయి. ఈ సమయంలో మరింత మంది కరోనా రోగులకు చికిత్స అందించేందుకు చిన్న స్థాయి ప్రైవేట్‌ ఆసుపత్రి వారు ఫంక్షన్‌ హాల్స్ మరియు కొన్ని ప్రైవేట్‌ స్కూల్స్ ను తీసుకుని కరోనా ఆసుపత్రులుగా మార్చుతున్నారు. ఇక కార్పోరేట్‌ ఆసుపత్రులు తమ బెడ్స్ అన్ని కూడా ఫుల్‌ అవ్వడంతో స్టార్‌ హోటల్స్ ను అద్దెకు తీసుకుని కోవిడ్‌ సెంటర్ లుగా మార్చుతున్నారు. హైదరాబాద్‌ లోని దాదాపు అన్ని కార్పోరేట్‌ ఆసుపత్రులు కూడా ప్రత్యేక కోవిడ్‌ సెంటర్‌ లను ఏర్పాటు చేశాయి. అందుకోసం ఎక్కువగా స్టార్‌ హోటల్స్ ను ఆశ్రయిస్తున్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15 ఆసుపత్రులు ఇప్పుడు స్టార్‌ హోటల్స్ లో కూడా బెడ్స్ ను ఆక్సీజన్‌ సిలిండర్ లను ఏర్పాటు చేసి ఐసోలేషన్‌ సెంటర్‌ లు గా మార్చుతున్నారు. డబ్బున్న వారు కరోనా పాజిటివ్‌ వచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలి వెళ్తున్నారు. అందుకే నగర వ్యాప్తంగా కూడా ఆసుపత్రులు ఫుల్‌ అయ్యాయి. అందుకే ప్రతి ఆసుపత్రి కూడా ఒకటి లేదా రెండు స్టార్‌ హోటల్స్‌ ను ఐసోలేషన్‌ సెంటర్‌ లుగా మార్చేశాయి. యశోద ఆసుపత్రి నిర్వాహకులు బేగంపేట గ్రీన్ పార్క్‌ హోటల్‌.. అశోక హోటల్‌ లను ఐసోలేషన్‌ సెంటర్‌ లుగా మార్చి తమ సిబ్బందితో కరోనా పేషంట్లకు ట్రీట్‌ మెంట్ ఇస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రి వారు సిస్టా హోటల్ మరియు మనోహర్‌ హోటల్ లో ఐసోలేషన్‌ సెంటర్‌ లను ఏర్పాటు చేశారు.

కేర్‌ ఆసుపత్రి వారు కంఫర్ట్‌ హోటల్‌.. కాంటినెంటల్‌ ఆసుపత్రి వారు మారియట్ హోటల్ ను ఐసోలేషన్‌ సెంటర్‌ లుగా మార్చేశారు. మొత్తంగా 15 ఆసుపత్రులు పెద్ద సంఖ్యలో స్టార్‌ హోటల్స్ ను ఐసోలేషన్‌ సెంటర్‌ లు గా మార్చి ఖరీదైన వైధ్యంను అందిస్తున్నారు. సెలబ్రెటీలు మరియు వ్యాపారులు ఇంకా రాజకీయ నాయకులకు సంబంధించిన వారు కార్పోరేట్ ఆసుపత్రులకు చెందిన స్టార్ హోటల్‌ ల్లో చికిత్స పొందుతున్నారు.