Begin typing your search above and press return to search.

నా మొగుడి ట్రాక్ రికార్డు చూడండి.. ఇక‌నైనా నోరు మూస్కోండిః క్రికెట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   3 March 2021 12:30 AM GMT
నా మొగుడి ట్రాక్ రికార్డు చూడండి.. ఇక‌నైనా నోరు మూస్కోండిః క్రికెట్ బ్యూటీ
X
క్రికెట్ బ్యూటీ, స్టార్ స్పోర్ట్స్ హోస్ట్ మయాంతి లాంగర్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. త‌న భ‌ర్త‌ను అన్యాయంగా ట్రోల్ చేస్తున్నారంటూ గ‌తంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మ‌యాంతి.. తాజాగా త‌న భ‌ర్త ఘ‌న‌త గురించి పోస్ట్ చేసింది. అంతేకాదు.. ఆ పోస్టుకు ‘హ‌ల్ హేట‌ర్స్‌.. నా భర్త అరుదైన ఘనత సాధించాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

మ‌యాంతి టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ సతీమణి అన్న విష‌యం తెలిసింది. 2016లో భారత జ‌ట్టుకు ఒక‌ వన్డే ఆడిన బిన్నీకి.. ఆ త‌ర్వాత‌ మళ్లీ అవకాశం రాలేదు. అయితే.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఆడుతున్నాడు. కాగా.. గ‌తేడాది ఐపీఎల్‌లో కూడా అవకాశం కోల్పోయాడు. లాస్ట్‌ సీజన్ వేలంలో బిన్నీ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. దీంతో.. బిన్నీని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు కొంద‌రు. బిన్నీకి సంబంధించి ఏ టాపిక్ వ‌చ్చినా టీజ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. దీనిపై మయాంతి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. త‌న భ‌ర్త‌ను ట్రోల్ చేయ‌డంపై తనదైన శైలిలో బదులిస్తూ వచ్చింది.

తన భర్తను ద్వేషించే నెటిజన్లను మ‌రోసారి టార్గెట్ చేసిది మ‌యాంతి. స్టువర్ట్ బిన్ని సాధించిన ఘనతను వారికి తెలియజేసింది. దేశాళీ క్రికెట్‌లో స్టువర్ట్ బిన్ని 100 లిస్ట్-ఏ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘హలో హేటర్స్.. నా భర్త‌ అరుదైన ఘనత సాధించాడు.’ అని ట్వీట్ చేసింది. ‘100 మ్యాచ్‌లు దాని వెనుక బిన్ని 17 ఏళ్ల కష్టం ఉంది. కష్టపడే తత్వం, అతని పట్టుదలే ఇక్కడి వరకు వచ్చేలా చేశాయి. కాంగ్రాట్స్ చాంప్’ అని అని రాసుకొచ్చింది.

కాగా.. ఐపీఎల్ సీజన్లో మయాంతి యాంకరింగ్ గురించి అందరికీ తెలిసిందే. సినీయర్లతో ఇంటర్వ్యూలు తీసుకుంటూ సక్సెస్ ఫుల్ గా తన జాబ్ కంప్లీట్ చేసేది. అయితే.. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో గత సీజన్ లో బ్రేక్ తీసుకుంది. అయితే.. బొద్దుగా ఉండే మయాంతి.. డెలివరీ తర్వాత పూర్తిగా సన్నబడింది. దీంతో.. అభిమానులు షాకయ్యారు. ఈ సమయంలోనూ పలువురు సరదాగా బిన్నీని ట్రోల్ చేశారు. ‘అరే బిన్ని.. మయాంతిని ఏం చేశావ్ రా?’ అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి తాజా పోస్టుతో తన భర్త కెపాసిటీ నెటిజన్లకు తెలియజెప్పింది. మళ్లీ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయొద్దని ఇండైరెక్టుగా చెప్పేసింది మయాంతి.