Begin typing your search above and press return to search.

116 కోట్లు చెల్లించ‌లేమ‌న్న స్టార్ వైఫ్ లాయ‌ర్

By:  Tupaki Desk   |   4 Jun 2022 6:31 AM GMT
116 కోట్లు చెల్లించ‌లేమ‌న్న స్టార్ వైఫ్ లాయ‌ర్
X
'పైరేట్స్ ఆఫ్ ది క‌రేబియ‌న్' న‌టుడు జానీ డెప్ త‌న భార్య‌పై ప‌రువు న‌ష్టం దావాలో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం కోర్టు తీర్పు డెప్ కి అనుకూలంగా వెలువ‌డింది. అయితే అంత పెద్ద మొత్తాన్ని తాను చెల్లించ‌లేన‌ని భార్యామ‌ణి అంబ‌ర్డ్ చేతులెత్తేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తన మాజీ భర్త.. నటుడు జానీ డెప్ కి 10.35 మిలియన్ల డాల‌ర్ల‌(116 కోట్లు)ను అంబ‌ర్డ్ హ‌ర్డ్ నష్టపరిహారంగా చెల్లించలేని ప‌రిస్థితిలో ఉంద‌ని త‌న‌ న్యాయవాది ఎలైన్ చార్ల్ సన్ తెలిపారు. గురువారం ఒక ఇంటర్వ్యూలో అంబర్ న్యాయవాది ఎలైన్ మాట్లాడుతూ.. US కోర్టులో అంబర్ ను 'దెయ్యంగా చూపించారు' అని అన్నారు. ''అనుమతించకూడని అనేక విషయాలను ఈ కోర్టులో అనుమతించారు'' అని ఎలైన్ చెప్పారు.

జానీ డెప్ vs అంబర్ హర్డ్ తీర్పులో నష్టపరిహారంగా రూ.116 కోట్లు ఎందుకు చెల్లించాలి? అన్న‌దానిపైనా ప్ర‌స్తుతం వెబ్ లో డిబేట్ ర‌న్ అవుతోంది. అతనికి కేవలం రూ.15 కోట్లు మాత్రమే చెల్లిస్తే స‌రిపోతుంద‌ని కొంద‌రు అంబ‌ర్ హెర్డ్ అభిమానులు ఎటాక్ చేయ‌డం విశేషం.

పరువు నష్టం విచారణలో అమెరికా జూరీ జానీ డెప్ కు అనుకూలంగా .. యుకేలో తీర్పున‌కు వ్య‌తిరేకంగా తీర్పును వెలువ‌రించ‌డం గురించి చ‌ర్చ సాగుతోంది. ఏడుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడుకున్న‌ జ్యూరీ తీర్పుపై విశ్లేష‌ణ సాగుతోంది. జానీ -అంబర్ ఒకరినొకరు బ‌ట్ట‌బ‌య‌లు చేసుకుంటూ పరువు తీసుకున్నారని అయితే జానీకి చాలా గట్టి అవ‌మానం జ‌రిగింద‌ని నిర్ధారించిన కోర్టు జ్యూరీ అతనికి మాజీ భార్యామ‌ణి 10.35 మిలియన్ల డాల‌ర్లు నష్టపరిహారం చెల్లించాల‌ని తీర్పునిచ్చింది. అంబర్ కు అత‌డు 2 మిలియన్ డాల‌ర్ల‌ను చెల్లించాల‌ని కోర్టు అంది.

UK తీర్పు గురించి ప్ర‌స్థావించిన అంబ‌ర్ట్ త‌ర‌పు లాయ‌ర్ దానివ‌ల్ల నష్టం ఏమీ లేదని 2020లో UKలో తీర్పు వెలువడిందని తెలిపారు. అంబర్ జానీకి అంత పెద్ద మొత్తాన్ని చెల్లించగలరా? అని అడిగినప్పుడు ''అరెరే.. క‌చ్చితంగా చెల్లించ‌లేదు'' అని బదులిచ్చారు. UKలో 2020 కేసును ప్రస్తావిస్తూ న్యాయ‌వాది ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలను రివీల్ చేసారు. ''కోర్టు తీర్పు వ‌చ్చింది. కానీ దీనిని (చెల్లించ‌లేమ‌ని) జ్యూరీకి చెప్పడానికి మాకు అనుమతి లేదు. అయితే మిస్టర్ డెప్ లైంగిక హింసకు పాల్ప‌డ‌డ‌మే గాక‌.. కనీసం 12 సార్లు గృహ హింసకు పాల్పడ్డాడని కోర్టు కనుగొంది. కాబట్టి డెప్ బృందం దీని నుండి ఏమి నేర్చుకుంటోంది? అంబర్ ను డెమోనైజ్ చేయడం.. సాక్ష్యాలను అణచివేయడం త‌ప్ప‌! ఈ కేసులో అణచివేత‌కు సంబంధించిన‌ అపారమైన సాక్ష్యం మా వద్ద ఉంది. అది UK కేసులో విన్న‌వించాం. UK కేసులో అంబర్ గెలిచింది. మిస్టర్ డెప్ ఓడిపోయాడు'' అని కూడా స‌ద‌రు లాయ‌ర్ వెల్ల‌డించారు.

అభిమానుల్లో కోలాహాలం ఉత్సాహం..

అంబర్ హెర్డ్ పై పరువు నష్టం కేసులో జానీ డెప్ విజయం సాధించినందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అత‌డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కోర్టు తీర్పు వెలువ‌డ‌గానే భార‌త‌దేశంలో దిశా పటానీ- సోఫీ చౌదరి స‌హా ప‌లువురు బాలీవుడ్ తార‌లు సంబరాలు చేసుకున్నారు. బుధవారం నాడు జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్‌పై పరువు నష్టం దావాలో గెలిచాడు. ఫిబ్రవరి 2019లో జానీ ఫెయిర్ ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్ట్ లో కనీసం 50 మిలియన్ డాల‌ర్ల‌ పరువు నష్టం కోసం అంబర్ పై దావా వేసిన సంగ‌తి తెలిసిందే.

డిసెంబర్ 2018 ఆప్-ఎడ్ లో ఆమె తనను తాను 'గృహ దుర్వినియోగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పబ్లిక్ ఫిగర్' అని వర్ణిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్ లో రాసింది. 2022 జూన్ 1న‌ డెప్-హెర్డ్ పరువు నష్టం విచారణ ముగింపు దశకు వచ్చింది. డెప్ కు పరిహారం శిక్షాత్మక నష్టపరిహారం కలిపి 15 మిలియన్ డాల‌ర్ల‌ను అందజేయాల‌ని కోర్టు తీర్పును వెలువ‌రించింది. హియర్డ్ తన మాజీని పరువు తీసినందుకు దోషిగా తేలినప్పటికీ ఆమెకు 2 మిలియన్ల డాల‌ర్ల నష్టపరిహారం కూడా లభించింది.

డెప్ - హర్డ్ జంట‌ ఫిబ్రవరి 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 15 నెలల తర్వాత విడాకుల కోసం హియర్డ్ కోర్టులో ఫైల్ చేశారు. విడాకులు 2016లో ఖరారు అయ్యింది. ప‌రువు న‌ష్టం కేసులో భార్య‌పై డెప్ సంచ‌ల‌న విజ‌యం సాధించంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంబ‌రాలు మిన్నంటాయి.