Begin typing your search above and press return to search.

స్టార్ బక్స్ సీఈవోగా మనోడి జీతం ఎంతంటే.

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:30 PM GMT
స్టార్ బక్స్ సీఈవోగా మనోడి జీతం ఎంతంటే.
X
అత్యున్నత స్థానాలకు చేరుకోవటం అంత తేలికైన విషయం కాదు. గడిచిన కొద్ది సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీలక అధినేతలుగా.. సీఈవోలుగా భారతీయుల్ని ఎంపిక చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా భారత మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్ ను స్టార్ బక్స్ కొత్త సీఈవోగా ఎంపిక చేయటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కాఫీ షాప్ చైన్ కు సంబంధించి పలు సంస్థలు ఉన్నప్పటికీ స్టార్ బక్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.

కాఫీతో కనెక్టు కావటంలో స్టార్ బక్స్ కు ఉన్న నేర్పు.. అందులో కాఫీ తాగటం అనే అలవాటు ఒక జీవనశైలిగా మారుతుందన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు నాయకత్వం వహించేందుకు భారత మూలాలు ఉన్న వారిని ఎంపిక చేయటం.. సురక్షితమైన.. ప్రతిభావంతమైన వారుగా ఉండటమే కారణమన్న మాట వినిపిస్తోంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సీఈవోగా పూర్తి బాధ్యతల్ని చేపట్టనున్న లక్ష్మణ్ నరసింహన్ కు జీతం రూపంలో ఎంత ఆదాయం వస్తుంది? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వార్షిక మూల వేతనంగా దాదాపు రూ.10కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) మమరో రూ.12 కోట్లు బోనస్ తో పాటు సుమారు రూ.73 కోట్ల విలువైన ఈక్విటీ గ్రాంట్ ను కూడా అందుకోనున్నారు. అంటే.. 2023 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఏకంగా రూ.107 కోట్లకు పైగా వార్షిక ఈక్విటీ అవార్డును పొందుతారని చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా మెచ్చుకునే బ్రాండ్ స్టార్ బక్స్ అని.. ప్రస్తుతం మారుతున్న అలవాట్లకు తగినట్లుగా సేవలు అందించేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న కీలక సమయంలో తాను స్టార్ బక్స్ లో చేరటాన్ని లక్ష్మణ్ నరసింహన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.