Begin typing your search above and press return to search.
అమెరికాను వణికిస్తున్న నియంత చెల్లి
By: Tupaki Desk | 18 Jan 2017 4:42 AM GMTప్రపంచవ్యాప్తంగా మానవహక్కులకు విఘాతం కలిగిస్తున్నారంటూ అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఏడుగురి పేర్లను ప్రకటించగా అందరిలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పేరే కిమ్ జో జాంగ్. అమెరికా జాబితాలో మోస్డ్ డేంజరస్ లేడీగా పేరు ఉండటం అంటే జో జాంగ్ ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తి అయి ఉంటుందో కదా? ఇంతకీ ఎవరు ఈమె అంటే... హైడ్రోజన్ బాంబు పరీక్షలని, అణుబాంబులు వేస్తామని అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా సవాల్ విసురుతున్న ఉత్తరకొరియా దేశ నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ కు చిన్న చెల్లెల్లు! ఈ ఇంట్రడాక్షన్ చాలు ఈమె రేంజ్ ఏంటో చెప్పడానికి!
నియంత అన్నకు తగ్గ చెల్లెలు అయిన జో జాంగ్ వయసు కేవలం 26 ఏళ్లే. కానీ కిమ్ జోంగ్ పరిపాలనలో చాలా కీలకమైన వ్యక్తి. అయితే ఇపుడు ఈమె గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే...పదవి నుంచి దిగిపోయేముందు ఒబామా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులకు విఘాతం కలిగిస్తున్నారంటూ విడుదల చేసిన జాబితాలో జో జాంగ్ పేరు ఉంచడం, దానికి ఉత్తర కొరియా ఒక రేంజ్ లో రియాక్టవడం వల్ల! ఒబామా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తమ దేశ అధికారిక వార్త సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తరఫున ఉత్తరకొరియా ఘాటుగా తిప్పికొట్టింది. తమ దేశాధినేత చెల్లెలిపై నిషేధం విధించిన అగ్రరాజ్య అధినేత ఒబామాను తూర్పారపట్టింది. 'మిత్రమా ఒబామా.. నువ్వు దిగిపోవడానికి సమయం తక్కువగా ఉంది. మానవహక్కులు, అదీ ఇదీ అంటూ ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తావ్? సమాన్లు సర్దుకునే పనుందిగా! తొందరగా కానివ్వు' అని ఒబామాకు దిమ్మతిరిగే సెటైర్ వేసింది. ఇంత ప్రాధాన్యం ఇచ్చేందుకు అసలు జో జాంగ్ ప్రత్యేకత ఏమిటంటే హైడ్రోజన్ బాంబు పరీక్షలు, అణుబాంబులు వేస్తామని అమెరికాను చాలెంజ్ చేయడం వెనుక కీలక వ్యక్తి ఈమెనట. కిమ్ జాంగ్ ఉన్ కు ప్రధాన సలహాదారుగా ఇలాంటి సూచనలు ఇస్తున్నారట. 2011లో తండ్రి కిమ్ జాంగ్-2 అంత్యక్రియలప్పుడు మీడియాకు కనిపించిన జో జాంగ్ దాదాపు నాలుగేళ్ల అజ్ఞాత వాసం తర్వాత తెరమీదకు వచ్చి . గత ఏడాదిన్నరగా కొరియా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న జో జాంగ్ ప్రస్తుతం ఆమె అధికార వర్కర్స్‌పార్టీ ఉపసంచాలకురాలిగా కొనసాగుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/