Begin typing your search above and press return to search.
అవాక్కు అయ్యేలా చేసే టమోటా బ్యాంకు
By: Tupaki Desk | 3 Aug 2017 9:14 AM GMTఎవరికి వచ్చిందో కానీ ఈ ఐడియా వింటే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టటం ఖాయం. ఆకాశాన్ని అంటే టమోటా విషయంలో క్రియేటివ్ గా ఆలోచించిన ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వర్షాలతో టమోటా పంట నాశనం అవుతున్న నేపథ్యంలో ధరలు ఆకాశాన్ని టచ్ చేస్తున్న వైనం తెలిసిందే. ఆ మధ్యన కిలో వంద వరకు పలికిన టమోటా ధరలు ఇప్పుడిప్పుడే కిందకు దిగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మండుతున్న ధరలతో టమోటా కొనాలంటే కరెంటు షాక్ తగిలేలా ఉన్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో కాంగ్రెస్ కార్యకర్తలు చిత్రమైన బ్యాంకు ఒకటి స్టార్ట్ చేశారు. ఈ బ్యాంకు పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమోటా. ఇంతకీ ఈ బ్యాంకు చేసే పని ఏమిటో తెలిస్తే అవాక్కు కావాల్సిందే.
ఎవరికైనా టమోటాలు అవసరమైతే ఇక్కడి వెళితే ఇస్తారు. అయితే..టమోటాలకు టమోటాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఇవ్వటమే చేస్తే కష్టం కాబట్టి.. టమోటాల్ని డిపాజిట్ చేసే పని కూడా మొదలు పెట్టారు. ఈ బ్యాంకులో కిలో టమోటాలు డిపాజిట్ చేస్తే.. ఆర్నెల్ల తర్వాత రెండు కిలోల టమోటాలు తిరిగి ఇచ్చారు. డిపాజిట్ చేసిన టమోటాలకు రెట్టింపు టమోటాలు ఆర్నెల్ల తర్వాత ఇస్తారన్న ఆఫర్ తో చాలామంది తమ దగ్గరి టమోటాల్ని డిపాజిట్ చేస్తున్నారు.
ముఖ్యంగా.. టమోటా రైతులు.. తోటల్లో టమోటాల్ని పండించేవారు ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డబ్బులు ఖర్చు చేయకుండా ప్రస్తుతానికి టమోటాల్ని అప్పుగా తీసుకుంటున్నారు. వారు తిరిగి ఇచ్చే సమయంలో రెట్టింపు టమోటాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టమోటా బ్యాంకుకు ఆదరణ భారీగా ఉందని చెబుతున్నారు.