Begin typing your search above and press return to search.

త‌న దేశ పౌరుల్ని ఆ దేశానికి వెళ్లొద్ద‌న్న అమెరికా

By:  Tupaki Desk   |   3 Aug 2017 4:58 AM GMT
త‌న దేశ పౌరుల్ని ఆ దేశానికి వెళ్లొద్ద‌న్న అమెరికా
X
అగ్ర‌రాజ్యం అమెరికా త‌న దేశ‌స్తుల‌కు ఒక కీల‌క ఆదేశాన్ని జారీ చేసింది. సెప్టెంబ‌రు ఒక‌టో తేదీ నుంచి అమెరిక‌న్లు ఎవ‌రూ ఉత్త‌ర కొరియాకు వెళ్లొద్ద‌ని పేర్కొంది. సెప్టెంబ‌రు ఒక‌టో తేదీ నుంచి త‌మ దేశ‌స్తుల్ని ఆ దేశానికి వెళ్లొద్దంటూ నిషేధాన్ని జారీ చేసింది. ఉత్త‌ర కొరియాకు వెళుతున్న అమెరిక‌న్లు కొంద‌రు అక్క‌డ అరెస్ట్ అవుతున్నారు.

కార‌ణాలు వెల్ల‌డి కాకుండానే ఎక్కువ మంది అమెరిక‌న్లు జైళ్ల‌ల్లో మ‌గ్గిపోతున్నారు. దీంతో.. ఆ దేశానికి వెళ్లే త‌మ పౌరుల‌కు భ‌ద్ర‌త లేని నేప‌థ్యంలో నిషేధాన్ని జారీ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అయితే.. నిషేధంలో పాత్రికేయుల్ని మిన‌హాయించారు. ప్ర‌త్యేక అవ‌స‌రాల దృష్ట్యా ఉత్త‌ర కొరియాకు వెళ్లాల్సిన నేప‌థ్యంలో వారికి మాత్రం నిషేధం అమ‌లు కాదు. దాదాపు ఏడాది పాటు అమ‌ల్లో ఉండే ఈ నిషేధం పుణ్య‌మా అని ఉత్త‌ర కొరియాకు అమెరికన్ల రాక‌పోక‌లు పూర్తిగా బంద్ అవుతాయ‌న‌టంలో సందేహం లేదు.

ఉత్త‌ర కొరియాను చూసేందుకు వెళ్లిన 22 ఏళ్ల అమెరిక‌న్ విద్యార్థి వాంబియ‌ర్ ఓట్టోపై కేసు పెట్టి 18 నెల‌ల పాటు ప్యాంగ్యాంగ్ జైల్లో పెట్టారు. అనంత‌రం పెద్ద ఎత్తున వ‌చ్చిన ఒత్తిడితో అత‌న్ని జైలు నుంచి విడుద‌ల చేశారు. అయితే.. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారానికే ఓట్టో ప్రాణాలు విడ‌వ‌టం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై అమెరికా అధ్య‌క్షుడు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్త‌ర కొరియా క్రూరంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న మాట‌ను చెప్పిన ట్రంప్ మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. తాజాగా ఆ దేశానికి అమెరిక‌న్లు ఎవ‌రూ వెళ్లొద్దంటూ నిషేధాన్ని విధించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌రి.. అమెరికా నిషేధంపై ఉత్త‌ర‌కొరియా ఎలా స్పందిస్తుందో చూడాలి.