Begin typing your search above and press return to search.

ఈ రోజు నుంచి రాష్ట్ర రాజ‌కీయం మారుతుంది: ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   18 Oct 2022 8:30 AM GMT
ఈ రోజు నుంచి రాష్ట్ర రాజ‌కీయం మారుతుంది:  ప‌వ‌న్‌
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు(అక్టోబ‌రు 18) నుంచి రాష్ట్రంలో రాజ‌కీయ ముఖ‌చిత్రం మారుతుందని అన్నారు. బీజేపీని రోడ్ మ్యాప్‌ను అడ‌గ‌డం త‌ప్పులేద‌ని.. వ్యాఖ్యానించారు.

మంగ‌ళ‌గిరిలో ఆయ‌న మాట్లాడుతూ.. పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. కేంద్రంతో సంబం ధాలు పెట్టుకుంటే త‌ప్పులేద‌న్న ప‌వ‌న్‌.. ప్ర‌ధాని మోడీ అంటే గౌర‌వం ఉంద‌ని.. కానీ, ఊడిగం మాత్రం చేయ‌బోమ‌ని అన్నారు. పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వం ఉంద‌న్నారు. వైసీపీ నేత‌ల గురించి ఏమ‌న్నారంటే..

''మీ నాయ‌కురాలు భార్య భార‌త‌మ్మ‌ను అన్నార‌ని అంటున్నారు.. నీచుల్లారా!.. మా అమ్మ అంజ‌నాదేవిని ఎంత నీచంగా తిట్టించారు. గుర్తుందా? త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్న నా బిడ్డ‌ల‌ను కూడా తిట్టించారు.. దుర్మార్గుల్లారా? అది మ‌రిచిపోయారు. మీకు నొప్పి క‌లిగితే ఒక‌విధంగా.. మాకు నొప్పి క‌లిగితే ఒక విధంగా మాట్లాడతారా?'' అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ''అరె వైసీపీ గూండాల్లారా.. గుర్తు పెట్టుకోండి..నేను రెడీరా.. ఈ రోజు నుంచే యుద్ధం మొద‌లు. మీరోనేనో తేల్చుకుందాం'' అని స‌వాల్ విసిరారు.

''తెలంగాణ నుంచి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ల‌కు ఒక‌టే చెబుతున్నా. ఏపీ అభివృద్ది తెలంగాణ‌కు అవ‌స‌రం. కొండ‌గ‌ట్టుతోనే మొద‌లు.. 7-14 ఎంపీ స్థానాలు.. ఏది కావాలో తేల్చుకోండి. బ‌లంగా నిల‌బ‌డ‌దాం.

ఆంధ్రాలో జ‌న‌సేన జెండా ఎగ‌రేద్దాం. వైసీపీ గూండాలు రాడ్లు ప‌ట్టుకొస్తే.. మ‌నం రాడ్లు తెద్దాం. వాళ్లు దాడులు చేస్తే.. మ‌నం మామూలుగా కొట్టం.. చెప్పు తీసుకుని కొడ‌తాం. డిబేట్స్‌కు వెళ్లండి.. పాల‌సీపై మాట్లాడితే.. మాట్లాడండి. తేడా వ‌స్తే.. ప‌బ్లిక్‌గా కుమ్మేయండి.. నాకొడుకుల‌ను'' అని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి కొడాలి నానిని .. శ‌త‌కోటి లింగాల్లో బోడి లింగాల్లో ఒక‌టి.. అని ప‌వ‌న్ అన్నారు. ''చావోరేవో.. రాజ‌కీయాల్లోనే.. సినిమాలు చేస్తా.. పార్టీని పోషించాలి క‌దా! మేం దోపిడీలు చేయం. సిమెంటు కంపెనీలు లేవు. సైద్ధాంతిక‌.. నిబ‌ద్ధ‌త ఉన్న రాజ‌కీయ నేత కొడితే.. ఎలా ఉంటుందో చూపిస్తా ఈ రోజు నుంచి యుద్ధానికి స‌న్న‌ద్ధం కండి!'' అని మ‌రోసారి వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ హెచ్చ‌రించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.