Begin typing your search above and press return to search.
రూ.2వేల నోటుపై షాకింగ్ న్యూస్
By: Tupaki Desk | 16 Jan 2020 11:02 AM GMTమోడీ తన గత ప్రభుత్వ హయాంలో ఓ శుభముహార్తాన నల్లడబ్బును వెలికితీయాలనే సదుద్దేశంతో దేశంలో చెలామణీలో ఉన్న పెద్దనోట్లను రద్దు చేశారు. అప్పుడు అందరి ఇళ్లల్లో ఉన్న పాత రూ.1000 - రూ500 నోట్లను బ్యాంకులో జమ చేసిన ప్రజలు - వ్యాపారులు - పారిశ్రామికవేత్తలు వాటి స్థానంలో కొత్త నోట్లను పొందారు.
అయితే ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో రూ.2వేల నోటు తెచ్చినట్టు మోడీ సార్ సెలవిచ్చారు. కాపీ కొట్టడానికి వీలు లేదని బీరాలకు పోయాడు. కానీ దాని భద్రత డొల్లతనం బయటపడింది. తాజాగా దేశంలో చలామణీలో ఉన్న నకిలీ నోట్లలో సగానికి పైగా రూ.2వేల నోట్లు ఉన్నాయని తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన డేటా ప్రకారం ప్రధాని నరేంద్రమోడీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశంలో పట్టుబడ్డ నకిలీ నోట్లలో ఎక్కువ శాతం 2వేల నోట్లు అని తేలింది. ఏకంగా 56శాతం మార్కెట్లోకి ప్రవేశించాయి.
అంతేకాదు.. దేశంలోనే నకిలీ కరెన్సీకి గుజరాత్ అడ్డాగా మారింది. దేశ ప్రధాని సొంత రాష్ట్రంలో నకిలీ నోట్ల అడ్డాగా మారడం ఆయన ప్రతిష్టకే భంగం వాటిల్లేలా మారింది.