Begin typing your search above and press return to search.
రాష్ట్రాలు అప్పుల మయమే.. కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్!
By: Tupaki Desk | 1 Feb 2022 10:31 AM GMTకేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్.. రాష్ట్రాలకు ఏం చేసింది? ఏమేరకు రాష్ట్రాలకు ఈ కరనో సమయంలో ఊతమిచ్చిం ది? అనే అంశాలను పరిశీలిస్తే.. ఆర్తిక రంగ నిపుణులు.. నిప్పులు చెరుగుతున్నారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి చిప్పే మిగిలిందని.. వారు అంటున్నారు. కేంద్రంపై రాష్ట్రాలు అనేక ఆశలు పెట్టుకున్నాయని.. కానీ.. ఒక్కటి తీర్చలేదని చెబుతున్నారు. అంతేకాదు.. కరోనా మహమ్మారితో గడిచిన రెండు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. తమను ఆదుకోవాలని.. కేంద్రం ముందు మోకరిల్లుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన బడ్జెట్‌పై ఆశలు ఉన్నాయి. కానీ.. ఆశలు పటాపంచలు అయ్యాయని.. నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా జీఎస్టీ వసూళ్లలో తమకు అన్యాయం జరుగుతోందని.. రాష్ట్రాలు నిప్పులు చెరుగుతున్నాయి. అదేవిధంగా పెట్రోల్‌పై సస్సెలు విధించినా.. తమకు రూపాయి కూడా ఇవ్వకపోవడం.. తమకు ఇవ్వాల్సి వస్తుందనే సెస్సును అమలు చేయడం.. ఇలా అనేక రూపాల్లో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని.. ప్రభుత్వాలు చెబుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత బడ్జెట్‌లో అయినా న్యాయం చేయాలని..అ న్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు నెలల తరబడి డిల్లీలోనే కూర్చని.. తమ ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే.. ఎవరి ప్రతిపాదనను పట్టించుకోలేదు. అంతేకాదు.. నిధుల మొత్తాన్నీ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. పైగా మరింత అప్పులు చేసుకునేందుకు.. రాష్ట్రాలు అప్పుల పాలయ్యేందుకు మాత్రమే ప్రతిపాదనలు చేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి అంటూ.. రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్లను సాయంగా కేటాయిస్తు న్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 50 ఏళ్ల వ్యవధితో ఇచ్చే ఈ వడ్డీ రహిత రుణాలుగా పేర్కొన్నారు. అంతేకాదు, రాష్ట్రాల సాధారణ రుణాలకు ఇది అదనమని తెలిపారు. పీఎం గతి శక్తి, రాష్ట్రాల ఇతర మూలధన పెట్టుబడుల కింద ఈ నిధులను కేటాయిస్తామన్నారు.
అంటేదీనిని బట్టి.. రాష్ట్రాలకు కేవలం ఎలా చూసుకున్నప్పటికీ.. కేంద్రం అప్పులు మాత్రమే ఇస్తుంది. నేరుగా ఇచ్చే గ్రాంట్లు కానీ.. పథకాలకు ఇచ్చే చేయూత కానీ ఏమీ కనిపించడం లేదు. దీనివల్ల రాష్ట్రాలు మరిన్నిఅప్పులు చేయకతప్పని పరిస్థితి నెలకొంది.
మరోవైపు 2022-23లో రాష్ట్రాలకు ద్రవ్యలోటు పరిమితుల్లో కేంద్రం మార్పు చేసింది. జీఎస్‌డీపీలో 4 శాతం వరకు ద్రవ్యలోటుకు అనుమతినిచ్చింది. కానీ ఈ మొత్తంలో 0.5 శాతం విద్యుత్ రంగ సంస్కరణలకు కేటాయించాలని స్పష్టం చేసింది. ఇది కూడా రాష్ట్రాలకు ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కీలకమైన కేంద్ర ప్రాజెక్టుల ఊసు ఎత్తలేదు. అంతేకాదు.. రాష్ట్ర విభజన తర్వాత.. చేయాల్సిన నిధుల భర్తీని అటు తెలంగాణకు, ఇటు ఏపీకి కూడా కేటాయించలేదు. పైగా.. ఇప్పుడు రుణాల కోసమే(వడ్డీలేని) కేటాయించిన లక్ష కోట్ల రూపాయలు కూడా దేశంలోని రాష్ట్రాలకు ఏమేరకు సరిపోతాయని అంటున్నారు నిపుణులు. సో.. దీనిని బట్టి బడ్జెట్ ద్వారా అన్ని రాష్ట్రాలకూ చిప్పే మిగులుతుందని చెబుతున్నారు.