Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: జీసస్ కళ్లుతెరిచారు!
By: Tupaki Desk | 16 Aug 2016 4:19 AM GMTవినాయకుడు పాలు తాగడం గురించి విన్నాం! అప్పట్లో అదో సంచలనం. దేశవ్యాప్తంగా వినాయక విగ్రహాల ముందు స్పూన్ పాలు పెడితే చాలు... ఇట్టే మాయమైపోతూ ఉండేవనేది అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. దేవుడు పాలు తాగడానికి భూమ్మీదికి వచ్చాడని ప్రజలంతా తండోపతండాలుగా వినాయకుడి తొండానికి పాలు అందించేశారు. ఇలాంటిదే మక్కాలో కూడా ఒక సంచలనం చోటు చేసుకుంది. ఒక నల్లని గుర్రం ఆకాశంలో రంకెలేసుకుంటూ అలాఅలా పరుగులు తీసిందని అప్పట్లో చెప్పుకునేవారు. మేరీ విగ్రహం కళ్ల నుంచి రక్తం ధారలుగా కారడం కూడా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు ఇలాంటిదే మరో సంఘటన వైరల్ అవుతోంది. ఈ సంఘటన కొందరికి ఆశ్చర్యం కలిగిస్తే మరికొందరికి ఆనందాన్ని కలిగిస్తోంది!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. ఆ ఫుటేజ్ లో ఉన్నది ఏంటంటే... ఒక చర్చిలో ప్రార్థనలు వినిపిస్తూ ఉంటాయి. ఆ చర్చిలో అద్దాల మధ్యలో శిలువపై ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ఉంటుంది.. ఆ సమయంలో ఆ విగ్రహం అలా కళ్లు తెరిచి - కొన్ని సెకన్ల పాటు చూసి, వెంటనే కళ్లు మూసేసినట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియో ఏ చర్చిలో చిత్రీకరించారూ ఎవరు చిత్రీకరించారు అనే వివరాలేవీ లేవు కానీ, చూడ్డానికి ఆసక్తికరంగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జీసస్ కళ్లు తెరిచి చూస్తున్నారు.. అనే ట్యాగ్ లైన్ లో ఈ వీడియో ఫేస్ బుక్ లు - ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ, నిజంగా యేసుక్రీస్తు కళ్లు తెరిచి చూశారా అంటే... శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ ప్రస్తుతానికైతే లేవు.