Begin typing your search above and press return to search.

ఆ జిల్లాలో మ‌ద్య‌మే మ‌ద్యం

By:  Tupaki Desk   |   16 April 2020 7:10 AM GMT
ఆ జిల్లాలో మ‌ద్య‌మే మ‌ద్యం
X
లాక్‌డౌన్ నేప‌థ్యంలో అన్ని వ్యాపారాలు బంద‌య్యాయి. వాటిలో భాగంగా మ‌ద్యం వ్యాపారం కూడా మూత ప‌డింది. మ‌ద్యం దుకాణాలు దాదాపు నెల రోజులుగా మూసే ఉన్నాయి. కానీ తెలంగాణ‌లోని ఒక్క జిల్లాలో మాత్రం మ‌ద్యం ప్ర‌వహిస్తోంది. మందుబాబుల‌ను మ‌త్తులో ముంచుతోంది. లాక్‌డౌన్ ఎంత ఉన్నా అధికార పార్టీ నాయ‌కుడి ప్రోత్సాహంతో మ‌ద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా చుక్క మందు.. ఒక్క పెగ్ కూడా ల‌భించ‌ని మ‌ద్యం ఆ జిల్లాలో మాత్రం విచ్చ‌ల‌ విడిగా ల‌భిస్తోంది. అయితే ఎక్క‌డా మ‌ద్యం ల‌భించ‌కుండా త‌మ ప్రాంతంలో మాత్రం ల‌భిస్తుండ‌డంతో మందు బాబులు కూడా ఎవ‌రూ బ‌య‌ట‌కు తెలియ‌నీయ‌డం లేదు. ఆ నాయ‌కుడి ప్రోత్సాహంతో ఉత్సాహంగా మ‌ద్యం వ్యాపారం సాగుతుండ‌డం తో రాష్ట్ర‌ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మాజీ ప్ర‌జాప్ర‌తినిధి మ‌ద్యం వ్యాపారానికి స‌హ‌క‌రిస్తున్నార‌ని స‌మాచారం. మ‌ద్యం దుకాణాలు మూసేసే ఉన్నాయి. కానీ అడ్డ దారుల్లో మ‌ద్యం వ్యాపారం మాత్రం య‌థేచ్ఛ‌గా సాగుతోంది. ప్ర‌స్తుతం మ‌ద్యానికి భారీగా డిమాండ్ ఉండ‌డం తో దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయ‌న అనుచ‌రులు వ్యాపారం సాగిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎక్సైజ్‌, పోలీస్ అధికారులు కూడా స‌హ‌క‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. వారు చూసీచూడ‌కుండా వ‌దిలేయ‌డంతో ప్ర‌స్తుతం ఆ వ్యాపారం లాక్‌డౌన్‌ లోనూ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఈ వ్యాపారంతో మందు బాబుల‌తో పాటు మ‌ద్యం వ్యాపారుల‌కు పండ‌గ అయ్యింది. వారికి మత్తు.. వీరికి చిత్తు కావాల్సి ఉండ‌డంతో ఆ జిల్లాలో మ‌ద్యం విక్ర‌యాలు య‌థేచ్ఛ‌గా సాగుతున్నాయి. అయితే మ‌ద్యం వ్యాపారం విష‌యంపై ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు సీరియ‌స్‌ గా ఉన్నారు. ప‌లుమార్లు మీడియా ముఖంగా మ‌ద్యం దుకాణాలు తెరిచేదే లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి అలా చేస్తుండ‌గా ఆ పార్టీకి చెందిన నాయ‌కులు మాత్రం ఈ విధంగా వ్యాపారం సాగిస్తున్నారు.