Begin typing your search above and press return to search.
హెచ్ఐవీ నుంచి కోలుకున్న మహిళ.. తొలిసారి స్టెమ్ సెల్ తో ఘనత
By: Tupaki Desk | 17 Feb 2022 1:30 PM GMTహెచ్ఐవీ.. ఇది సోకితే ప్రాణాలు పోవడమే.. చికిత్స లేని ఈ వ్యాధికి మందులు లేవు. ఈ ఎయిడ్స్ వ్యాధులకు మందు అనేది లేదు. చికిత్స కూడా ఇప్పటివరకూ లేదు. కేవలం నివారణ ఒక్కటే మార్గం. గత మూడు దశాబ్ధాలుగా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ, ఎయిడ్స్ ను నిర్మూలించడానికి శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు.
ఇన్నాళ్లకు వారు పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లే కనిపిస్తోంది. తాజాగా హెచ్ఐవీ సోకిన రోగికి మొట్టమొదటిసారి కొత్త టెక్నాలజీతో విజయవంతంగా చికిత్స అందించి అమెరికా వైద్య నిపుణులు కొత్త రికార్డు నెలకొల్పారు. దీనికి సంబంధించిన పరిశోధకులు డెన్వర్ కు విలేకరుల సమావేశంలో ఈ చికిత్సా విధానానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.
స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈ మిరాకిల్ జరిగినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సందర్భంగా స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ అంటే ఏమిటీ? దీని చికిత్స విధానం ఎలా ఉంటుంది? దీనికి ఎంత ఖర్చవుతుందనే వివరాలు బయటకొచ్చాయి.
హెచ్ఐవీ వైరస్ కు వ్యతిరేకంగా సహజ రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తి మూల కణాలను దానం చేశారు. ఆ మహిళ లుకేమియా చికిత్సకు డాక్టర్లు బొడ్డు తాడు రక్తాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ప్రస్తుతం ఆ మహిళ 14 నెలల పాటు ఆరోగ్యంగా ఉంది. తనకు ఎలాంటి మందులు అవసరం లేదు.
ఈమె కంటే ముందు ఇద్దరు హెచ్ఐవీ సోకిన పురుషులు కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడిన రెండు కేసులు ఉన్నాయని వైద్యులు వివరించారు. వారిద్దరికీ స్టెమ్ సెల్ మార్పిడి కూడా జరిగింది. ఈ మహిళకు 2013లో హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత లుకేమియా కూడా ఉన్నట్టు తేలింది.
హ్యాప్లో త్రాడు మార్పిడి ద్వారా చికిత్స చేశారు. పాక్షికంగా సరిపోలిన దాత నుంచి రక్తం తీసుకొని 2017 రక్తమార్పిడి చేయగా.. నాలుగేళ్లలో ఆమె లుకేమియా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మూడేళ్ల తర్వాత డాక్టర్లు తనకు హెచ్ఐవీ చికిత్స కూడా నిలిపివేశారు. దీంతో ఆమె ఇప్పుడు హెచ్ఐవీ నుంచి పూర్తిగా ఆమె కోలుకుంది.