Begin typing your search above and press return to search.

16ఏళ్ల బాలుడితో సవతితల్లి ఎఫైర్

By:  Tupaki Desk   |   20 March 2020 12:30 AM GMT
16ఏళ్ల బాలుడితో సవతితల్లి ఎఫైర్
X
సమాజంలో వావి వరసలు మాయమవుతున్నాయి. దేశంలోనే ఇప్పుడు బంధాలకు విలువ లేకుండా ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఇక విదేశాల్లో అయితే ఇలాంటి బంధాలు లేనే లేవు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే సంబంధాలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

తాజాగా బ్రిటన్ దేశంలో 16 ఏళ్ల బాలుడితో సవతి తల్లి ఎఫైర్ పెట్టుకోవడం కలకలం రేపింది. భర్త లేనప్పుడు బాలుడిని తన అందచందాలతో రెచ్చగొట్టి రెండేళ్లుగా ఆ మైనర్ బాలుడితో కామ కోరికలు తీర్చుకుంటున్న వైనం వెలుగుచూసింది.

బ్రిటన్ లోని కాజిల్ హిల్లో ప్రాంతానికి చెందిన వ్యక్తికి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడికి అప్పటికే 16 ఏళ్ల కొడుకున్నాడు. వచ్చిన సవతి తల్లి (38)కి కామ కోరికలు ఎక్కువగా ఉండేవి. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో సవతి కొడుకును లైన్లో పెట్టింది. అతడికి అందాలను ఎరవేసి రెచ్చగొట్టి అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజూ అతడిని స్కూలుకు కూడా పంపకుండా సవతి కొడుకుతో రాసలీలలు చేస్తూ ఉండేది.

అయితే కొడుకు స్కూలుకు వెళ్లకపోవడం ప్రవర్తనలో మార్పు రావడంతో కొడుకును తండ్రి గట్టిగా నిలదీశాడు. అప్పుడు కాని తండ్రికి అసలు విషయం అర్థమైంది. సవతి తల్లి రోజూ సెక్స్ కోసం ఒత్తిడి తెస్తూ బెడ్ రూంలోకి లాక్కెళుతోందని బాలుడు చెప్పాడు. షాకైన తండ్రి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెను దోషిగా తేల్చి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.