Begin typing your search above and press return to search.

ట్రంప్‌ తో నా అక్ర‌మ సంబంధం నిజ‌మే!

By:  Tupaki Desk   |   20 Jan 2018 12:58 AM GMT
ట్రంప్‌ తో నా అక్ర‌మ సంబంధం నిజ‌మే!
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ విష‌యంలో మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ట్రంప్‌ తో తనకు అక్రమ సంబంధముందని సినీనటి స్టెఫానీ క్లిఫార్డ్ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే ఈ విషయాన్ని వెల్లడించేందుకు తాను సిద్ధపడ్డానని తెలిపింది. ఈ వివరాలను అమెరికన్‌ టాబ్లాయిడ్‌ 'ఇన్‌ టచ్‌' ఓ కథనం రూపంలో ప్రచురించింది. ట్రంప్‌ తో ఉన్న లైంగిక సంబంధాన్ని ఎట్టిపరిస్థితుల్లో వెల్లడించకూడదని ట్రంప్‌ వ్యక్తిగత లాయర్‌ తనను బెదిరించాడని తెలిపింది. అంతేగాకుండా, ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉంటే తనకు ముడుపులు కూడా చెల్లిస్తానని చెప్పాడని పేర్కొంది.

ట్రంప్‌ తో శృంగారంలో పాల్గొన్నట్టు భావిస్తున్న సినీ శృంగారతార స్టెఫానీ క్లిఫార్డ్‌ ఇంటర్వ్యూను ప్రచురించింది. మెలానియా బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌ తో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు ఆమె ధ్రువీకరించింది. అప్పట్లో ట్రంప్‌ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న 'అప్రెంటిస్‌' షోలో తనకు పాత్ర ఇస్తానని ఆఫర్‌ కూడా చేశాడని ఆమె తెలిపింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్టార్మీ డానియెల్‌ గా పేరొందిన క్లిఫర్డ్‌ తమ ఎఫైర్‌ బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్‌ తన లాయర్‌ ద్వారా 1.30 లక్షల డాలర్లు చెల్లించాడని, తద్వారా రాజకీయ విమర్శలు రాకుండా ట్రంప్‌ ముందుజాగ్రత్తలు తీసుకున్నాడని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ గతవారం ఓ కథనాన్ని ప్రచురించగా.. ఈ కథనాన్ని వైట్‌ హౌస్‌ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే తాజా క‌థం సంచ‌ల‌నంగా మారింది