Begin typing your search above and press return to search.

హాకింగ్ బ్రతికున్నారా లేదా చనిపోయారా?

By:  Tupaki Desk   |   17 Jan 2018 4:39 AM GMT
హాకింగ్ బ్రతికున్నారా లేదా చనిపోయారా?
X
షాక్ కొట్టిన‌ట్లు అనిపించే ఈ మాట‌లు నిజ‌మ‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌ని చెబుతున్నారు ప‌లువురు. ఎప్పుడో చ‌నిపోయిన ప్ర‌ఖ్యాత భౌతిక‌శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ స్థానంలో మ‌రొక‌రిని తెచ్చి పెట్టార‌ని.. మ‌ర బొమ్మ‌గా ఇప్పుడు స‌రికొత్త వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న‌కున్న ఆరోగ్య స‌మ‌స్య‌ను అడ్డు పెట్టుకొని భారీ నాట‌కాన్ని న‌డిపిస్తున్న‌ట్లుగా వాదిస్తున్న వైనం ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా మాత్ర‌మే కాదు.. షాకింగ్ గా మారింది. కొన్ని రోజుల నుంచి స్టీఫెన్ హాకింగ్ చనిపోయి ఉంటాడు అని ఇంటర్నేషనల్ మీడియా లో వస్తున్న వార్తలు చూస్తున్నాం. వీటి కి మద్దతు గా మరి కొన్ని వార్తలు వచ్చాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా కొంద‌రు సిద్ధాంత‌క‌ర్త‌లు హాకింగ్ గురించి కొత్త వాద‌న‌ల్ని వినిపిస్తున్నారు. ఆయ‌న 1985లోనే చ‌నిపోయార‌ని.. ఆయ‌న రాసిన ఎ బ్రీఫ్ హిస్ట‌రీ ఆఫ్ టైమ్ పుస్త‌కాన్ని ప్ర‌చురించ‌టానికి ముందే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆ విష‌యాన్ని దాచి పెట్టి కొన్ని స్వార్థ‌శ‌క్తులు ఆయ‌న రూపంలో మ‌రొక‌రిని ఉంచి.. త‌మ ఎజెండాను ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపింప‌చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

హాకింగ్ మ‌ర‌ణించి ఉంటార‌న్న మాట‌కు ద‌న్నుగా కొన్ని వాద‌న‌లు వినిపిస్తున్నారు. అందులో ఆరు పాయింట్లు చాలా ముఖ్య‌మైన‌విగా నిల‌వ‌ట‌మే కాదు.. ఈ షాకింగ్ నిజాన్ని న‌మ్మేలా చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

1. ఆకింగ్ ఏఎల్ఎస్ అనే వింత జ‌బ్బు బారిన ప‌డ‌టం తెలిసిందే. మ‌నిషిని క్ర‌మేణా బ‌ల‌హీన‌పరిచి.. కృశించిపోయేలా చేసి.. న‌డ‌వ‌లేని.. క‌ద‌ల్లేని స్థితికి తీసుకెళ్లే భ‌యంక‌ర న‌రాల క్షీణ‌త వ్యాధి. దీనికి గురైన వారు నాలుగేళ్ల కంటే మించి బ‌త‌క‌రు. ఒక‌వేళ అద్భుతం అంటే ప‌దేళ్లు. హాకింత్ 1963లో ఈ వ్యాధికి గుర‌య్యారు. ఈ లెక్క‌న 1970 వ‌ర‌కు హాకింగ్ జీవించి ఉండాలి. కానీ.. ఈ వ్యాధి వ‌చ్చిన 55 ఏళ్ల త‌ర్వాత కూడా బ‌తికే ఉన్నారు. ఈ జ‌న‌వ‌రి 8న ఆయ‌న 77వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు.

2. వ‌య‌సుతో పాటు రూపంలో మార్పు వ‌స్తుంది. 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే హాకింగ్ ఇప్పుడు యంగ్ గా క‌నిపించ‌టం గ‌మ‌నార్హం.

3. వ‌య‌సుతో పాటు చెవులు క్షీణించ‌వు. కానీ కాస్త వంగిన‌ట్లు ఉంటాయి. కానీ హాకింగ్ చెవులు క్షీణించ‌టం క‌నిపిస్తుంది.

4. ప‌ళ్లు అరిగిన‌ట్లు ఉండాలి. కానీ.. ఆయ‌న ప‌ళ్లు బ‌లంగా క‌నిపిస్తాయి.

5. ఈ వ్యాధికి గురైన వారు వాయిస్ సింథ‌సైజ‌ర్ తో మాత్ర‌మే మాట్లాడుతున్నారు. కుడిద‌వ‌డ‌ను క‌దిలిస్తూ.. ఎదురుగా ఉన్న అడ్వాన్స్ డ్ కంప్యూర్ లో ప‌దాల్ని స్కాన్ చేస‌కొని ప‌లికితే అవి శ‌బ్ధ‌త‌రంగాలుగా మారి మ‌న‌కు వినిపిస్తాయి.

6. కుడి ద‌వ‌డ క‌ద‌లిక‌తో మాట‌లు రావు. అంటే.. ఎవ‌రో రోబో వాయిస్ వినిపిస్తున్నారు.
ఇవ‌న్నీ చూస్తున్న‌ప్పుడు హాకింగ్ మ‌ర‌ణించార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. మ‌రి.. మ‌ర‌ణించిన మ‌నిషి పేరును ఎందుకు వాడుకుంటున్న‌ట్లు? అన్న సందేహానికి ఈ వాద‌న‌ను వినిపిస్తున్న‌వారు చెప్పేదేమంటే.. ప్ర‌పంచాన్ని దేవుడే న‌డిపిస్తున్నాడ‌న్న వాద‌నను కొట్టిపారేసి శాస్త్ర‌బ‌ద్ధంగా ఆలోచించేట్లుగా మాన‌వాళికి మంచి మాట‌లు చెప్ప‌టానికి ఒక వ్య‌క్తి కావాల‌ని.. అందుకే ఐన్ స్టీన్ అంత తెలివితేట‌లు ఉన్న హాకింగ్ వ‌ల్లే సాధ్యం కావ‌టంతో.. ఆయ‌న పేరును అలా వాడేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. నిజం మాట ఎలా ఉన్నా.. నిజ‌మేన‌న్న భావ‌న ఈ వాద‌న మొత్తం విన్న‌ప్పుడు క‌లుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.