Begin typing your search above and press return to search.

ప్ర‌పంచానికి భారీ షాక్‌: హాకింగ్ ఇక‌లేరు

By:  Tupaki Desk   |   14 March 2018 5:48 AM GMT
ప్ర‌పంచానికి భారీ షాక్‌:  హాకింగ్ ఇక‌లేరు
X
స‌మ‌స్త మాన‌వాళికి షాకింగ్ న్యూస్‌. ప్ర‌పంచానికి పెద్ద దిక్కుగా ఉంటూ.. ఖ‌గోళంలో జ‌రిగే మార్పుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రించే ప్రఖ్యాత ఖ‌గోళ శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ (76) క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణంపై ఇప్ప‌టికే ప‌లుమార్లు క‌థ‌నాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లుగా ఆయ‌న కుటుంబ స‌భ్యులు తాజాగా ప్ర‌క‌టించారు.

క్రేంబ్రిడ్జ్ లోని ఆయ‌న నివాసంతో తుదిశ్వాస విడిచిన‌ట్లుగా పేర్కొన్నారు. 1942 జ‌న‌వ‌రి 8న ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫ‌ర్డ్ లో జ‌న్మించిన ఆయ‌న‌.. గ‌డిచిన కొన్ని సంవ‌త్స‌రాలుగా క‌ద‌ల‌టానికి స‌హ‌క‌రించిన శ‌రీరంతో చ‌క్రాల కుర్చీలో అతుక్కుపోయి ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

మాట్లాడే అవ‌కాశం లేని చిత్ర‌మైన వ్యాధితో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న ప్ర‌త్యేకంగా ఆయ‌న కోసం ఏర్పాటు చేసిన చ‌క్రాల కుర్చీలో ఆయ‌న ప్ర‌పంచంలో మాట్లాడుతున్నారు. హాకింగ్ నాడీ మండ‌లం పూర్తిగా పాడ‌వుతున్నా.. మెద‌డు స‌హ‌క‌రించ‌క‌పోవ‌టాన్ని స్టీఫెన్ గుర్తించారు. అప్ప‌టి నుంచి త‌న అభిప్రాయాల్ని చెప్పేందుకు వీలుగా వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేసుక‌న్నారు.

1970 నుంచి కృష్ణ బిలాల‌పై ప‌రిశోధ‌న‌లు ప్రారంభించిన స్టీఫెన్.. క్వాంటం థియ‌రీ.. జ‌న‌ర‌ల్ రెలెటివిటీల‌ను ఉప‌యోగించి కృష్ణ‌బిలాలు కూడా రేడియేష‌న్ ను వెలువ‌రిస్తాయ‌ని గుర్తించారు. కృష్ణ‌బిలాల‌పై ఆయ‌న చేసిన ప‌రిశోధ‌న‌లు ఖ‌గోళ రంగంలో అతి పెద్ద విప్ల‌వంగా అభివ‌ర్ణిస్తారు. ఆయ‌న మ‌ర‌ణం మాన‌వాళికి తీర‌ని లోటుగా చెప్పక త‌ప్ప‌దు. మొత్తంగా ప్ర‌పంచం ఒక పెద్ద‌దిక్కును కోల్పోయిన‌ట్లే.